Smita Sabharwal: తెలంగాణ రాష్ట్రంలో…. ప్రస్తుతం ఐఏఎస్ ల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో తెలంగాణలో పనిచేసిన 11 మంది ఐఏఎస్ అధికారులు ఏపీకి వెళ్లిపోయారు. అందులో అమరాపాలి ఉన్న సంగతి తెలిసిందే. ఆమెది ఏపీ కావడంతో అక్కడికి తరలించింది కేంద్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత చెప్పినా కూడా కేంద్రం వినలేదు. కోర్టును ఆశ్రయించినా కూడా అమరపాలి లాంటి అధికారులందరూ తరలిపోవాల్సి వచ్చింది. Smita Sabharwal

cm revanth reddy Big Chance To smita sabharwal

అయితే ఏపీకి వెళ్లిన 11 మంది అధికారులు చాలా కీలకమైన వారే. అయితే ఇలాంటి నేపథ్యంలో… వాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్మితా సబర్వాల్ కి కీలక పదవి ఇచ్చి.. అమరపాలి స్థానాన్ని భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. Smita Sabharwal

Also Read: Jagitial: కాంగ్రెస్ కు వెన్నుపోటు.. గులాబీ గూటికి జగిత్యాల ఎమ్మెల్యే?

హైదరాబాద్ డెవలప్మెంట్ అలాగే… డ్రగ్స్ నిర్మూలనపై స్మిత సబర్వాల్ కు కీలక పదవి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట రేవంత్ రెడ్డి. కెసిఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ చాలా చురుకుగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా ఆమెకు ఈ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా చేస్తుందని.. ఉన్నతాధికారులు సూచించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే.. నిర్ణయాన్ని తీసుకున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. Smita Sabharwal