Revanth Reddy: ఆగస్టు 15వ తేదీ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని గతంలో చెప్పారు. నాడు చెప్పిన విధంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ.1.5 లక్షల రుణమాఫీ చేసి రైతులను అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకొచ్చామన్నారు. నేడు మూడో విడత రుణమాఫీ చేస్తామని చెప్పారు. రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల లోపు రుణాలు నేడు మాఫీ అవుతాయని తెలిపారు.
CM Revanth Reddy Introduces Rythu Bharosa Program
కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి రుణమాఫీ కాలేదన్నారు. అర్హులైన వారందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇంకా రుణమాఫీ అందని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాంటి వారందరికీ మినహాయింపు లేకుండా రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Also Read: Raviteja: మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ!!
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు రక్ష పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. రైతు భరోసా ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు బంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.10,000 ఆర్థిక సాయం అందించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకానికి పేరు మార్చి ఎకరాకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందించనుంది. వాస్తవానికి జూన్, జూలై నెలల్లో రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా… రుణమాఫీ ప్రక్రియ కారణంగా పథకం అమలులో జాప్యం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ పథకానికి ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందో వేచి చూడాల్సిందే.