Deepthi Jeevanji: అథ్లెట్ జీవాంజి దీప్తి ప్రతిభకు వైకల్యం అడ్డు రాదని నిరూపించి పారా ఒలింపిక్స్ 2024లో పథకం సాధించింది. జీవాంజి దీప్తి తెలంగాణకు చెందిన యువతి. ఒలింపిక్స్ లో పథకం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజేత దీప్తిని సత్కరించారు. Deepthi Jeevanji
CM Revanth Reddy rewards Deepthi Jeevanji with Rs 1 crore, plot in Warangal
విశ్వ వేదికపై తన సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, కోటి రూపాయల నగదు, వరంగల్ లో 500 గజాల స్థలం ప్రకటించారు. కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షల బహుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. Deepthi Jeevanji
Also Read: Virat Kohli: రూ. 66 కోట్ల టాక్స్ కడుతున్న విరాట్ కోహ్లీ….!
ఇటీవల పారిస్ లో జరిగిన పారా ఒలింపిక్స్ 2024 మహిళల 400 మీటర్ల టీ20 రేస్ లో జీవాంజి దీప్తి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. పారా అథ్లెట్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇస్తూ వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. Deepthi Jeevanji
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. Deepthi Jeevanji