Congress: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ పార్టీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డికి కనీసం కుర్చీ కూడా ఇవ్వడం లేదని గౌడ్ ఆరోపించారు. తాము ప్రజాస్వామ్య విలువలను గౌరవించే కాంగ్రెస్ పార్టీగా ఉన్నామని, బీజేపీలో ఇలాంటి గౌరవం లేదని గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉండగా, బీజేపీ మాత్రం తమ నేతలను మరింత నిర్బంధంగా చూడాలని ప్రయత్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Congress Leader PCC Mahesh Kumar Goud Criticizes PM Modi
మీడియాతో మాట్లాడుతుండగా, గౌడ్ ప్రధాన మంత్రి మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ ఎప్పుడూ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, ఎప్పుడూ తమ పార్టీపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. రాహుల్ గాంధీ మాత్రం ఎలాంటి విమర్శలనైనా సానుకూలంగా తీసుకుంటారని, ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రాముఖ్యత ఇస్తారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి చేసిన సీఎం మార్పు వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా కొనసాగుతుందని, ఎటువంటి సంక్షోభం లేదని గౌడ్ స్పష్టం చేశారు.
Also Read: Prashanth Neel: ప్రశాంత్ నీల్ కు ఫస్ట్ ఫ్లాప్.. భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!!
కులగణన అంశాన్ని ప్రస్తావిస్తూ మహేశ్ కుమార్ గౌడ్, దీనిపై రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. కులగణన ప్రజల సామాజిక పరిస్థితులను సరికొత్తగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని గౌడ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మోసపూరిత విధానాల వలన ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచారని, అందుకే అధికారం తమకు అప్పగించారని మహేశ్వర్ రెడ్డి వివరించారు. ప్రజల సమస్యలను ఎల్లప్పుడూ అధిగమించేందుకు కృషి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో నేరుగా కలసి పనిచేస్తున్నారని, రాహుల్ గాంధీ నవంబర్ 5న పీసీసీ సమావేశంలో పాల్గొంటారని గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే కులగణనపై రాహుల్ గాంధీ నుంచి మరిన్ని మార్గదర్శకాలను అందుకుంటామని, దీనిపై వారి మద్దతు ఉందని గౌడ్ అన్నారు.