Court Orders Konda Surekha to Explain Comments on Akkineni Family

Konda Surekha: అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం ఇంకా ముగియలేదు. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న కోర్టుకు హాజరై ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Court Orders Konda Surekha to Explain Comments on Akkineni Family

కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ, కొండా సురేఖ నాగచైతన్య మరియు సమంత విడాకుల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వల్లే వారు విడిపోయారని, ఆయన కారణంగా చాలామంది హీరోయిన్‌లు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

Also Read: Ratan Tata: పిల్లలు లేని రతన్ టాటా వేలకోట్ల ఆస్థి ఎవరికీ చెందుతుంది?

విమర్శల తీవ్రతను గుర్తించిన కొండా సురేఖ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ, నాగార్జున ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేదు. తన కుటుంబం గౌరవానికి భంగం కలిగించినందుకు ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 8న కోర్టుకు హాజరైన నాగార్జున, కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తన కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైందని, రాజకీయ నాయకులు సినీ రంగంపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని న్యాయమూర్తికి తెలిపారు.

ఈ వివాదంలో కేటీఆర్ కూడా ప్రవేశించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన కూడా నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ రెండు కేసులపై కోర్టు విచారణ జరుపుతోంది. కొండా సురేఖ ఈ నెల 23న కోర్టుకు హాజరై తన వాదన వినిపించాల్సి ఉంది.