Deepika Padukone: ఏంటి బాలీవుడ్ నటి దీపిక పదుకొనే కడుపుకు కారణం ప్రభాసా.. వింటుంటే ఆశ్చర్యంగా ఉందే అని మీరందరూ అనుకుంటున్నారు కదూ..అయితే ఈ విషయాన్ని స్వయంగా తాజాగా ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే బయటపెట్టింది. ఈ కడుపుకు కారణం ప్రభాస్ అని అంటూ దీపిక చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Deepika Padukone: This belly is because of Prabhas
అయితే ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు అదేంటి రన్వీర్ సింగ్ పేరు చెప్పకుండా ప్రభాస్ పేరు చెప్పింది అంటూ దీపిక ను ట్రోల్ చేస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తన కడుపుకి కారణం ప్రభాస్ అంటూ దీపిక చెప్పింది ప్రెగ్నెన్సీ విషయంలో కాదు .తన ఆహారం విషయంలో.అసలు విషయం ఏమిటంటే.. ప్రభాస్ ఏ హీరోయిన్ తో సినిమా చేసినా కూడా ఆ సినిమా షూటింగ్ ఉన్నన్ని రోజులు తన ఇంటి నుండి క్యారేజీలు తీసుకువచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెడతారనే సంగతి మనకు తెలిసిందే. (Deepika Padukone)
Also Read: Darshan: అభిమానిని చంపి భార్య ఫ్లాట్లో క్షుద్ర పూజలు.. బయట పడుతున్న షాకింగ్ నిజాలు..?
ఇప్పటికే ఈయనతో నటించే చాలా మంది హీరోయిన్లు ఈ విషయాన్ని బయట పెట్టారు. ఇక ఈయనతో నటించిన హీరోయిన్లందరూ ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూడకుండా ఉండలేరు. అంతేకాదు ఆ భోజనం చాలా రుచిగా కూడా ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అయితే రీసెంట్ గా కల్కి సినిమా షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్ ఇంటి నుండి ప్రతిరోజు భోజనం వచ్చేదట.
అయితే ఎంతో ఆరోగ్యకరమైన అలాగే అద్భుతమైన రుచిగల భోజనాలు తింటూ తన పొట్ట పెరిగిపోయింది అని,ఈ కడుపు ఇంత పెరిగిపోవడానికి కారణం ప్రభాస్ ఇంటి ఫుడ్ అంటూ దీపిక చెప్పింది.కానీ దీపిక మాటలను వెరైటీగా అర్థం చేసుకున్న కొంత మంది జనాలు దీపికా ప్రెగ్నెన్సీ కి ప్రభాస్ కారణమేంటి అని కామెంట్లు పెడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రభాస్ ఇంటి ఫుడ్ తిని దీపికే పదుకొనే లావైపోయానన్నట్లు చెప్పింది.(Deepika Padukone)