Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బెంగుళూరు టెస్ట్ బ్యాటింగ్ లో లేదా కెప్టెన్సీలో అస్సలు మంచి జరగడం లేదు. అటు బ్యాటింగ్ లోను ఇటు కెప్టెన్సీలోను బెంగుళూరు టెస్ట్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మంచిది జరగడం లేదు. రెండో ఇన్నింగ్స్ లో అతను బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు రోహిత్ శర్మ. అయితే అతను బాగా ఆడినప్పటికీ దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యాడు. Rohit Sharma
Defeat at the hands of New Zealand Heavy punishment for Rohit Sharma
మ్యాచులో నాలుగో రోజు టీమిండియా 462 పరుగులకు ఆల్ అవుట్ అయింది. న్యూజిలాండ్ కు 107 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది. ఐదో రోజు కివీస్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. దీంతో 36 ఏళ్ల తర్వాత విజయం సాధించిన న్యూజిలాండ్, టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో టీమిండియా ఓటమి మాత్రమే కాకుండా భారత కెప్టెన్ కి కొత్త సమస్యలు వచ్చి చేరాయి. ఆ కారణంగా రోహిత్ శర్మకు శిక్ష పడనుంది. Rohit Sharma
Also Read: Ms Dhoni: చెన్నైపై అలిగిన ధోని.. ఐపీఎల్ 2025 నుంచి ఔట్ ?
మూడో రోజు టీమిండియా బౌలింగ్ ప్రారంభించిన సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో రోహిత్ వారితో గొడవకు దిగాడు. స్టంప్స్ తర్వాత మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ చాలా సేపటి వరకు భారత కెప్టెన్ తో సంభాషణ కొనసాగించాడు. అక్కడ రోహిత్ తన జట్టు తరఫున మాట్లాడడం జరిగింది. ఐసీసీ నిబంధన ప్రకారం అంపైర్ తో వాదిస్తే మందలింపు నుంచి జరిమాన వరకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఇక బూన్ భారత కెప్టెన్ పై చర్యలు తీసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. Rohit Sharma