Devara 2: ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ ఒకటి. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ వరల్డ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు ఎంతో భారీ ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ విడుదల సమయంలో అంచనాలకు తగ్గట్టుగా ఆసక్తిని రేకెత్తించకపోవడంతో సినిమా చుట్టూ కొంత నెగటివిటీ పెరిగింది. ఆ తర్వాత విడుదలైన మిడ్ నైట్ షోల నుంచి డివైడ్ టాక్ రావడం సినిమా బాక్సాఫీస్ ప్రయాణంపై అనుమానాలు పెంచింది. అయినప్పటికీ, ఈ ప్రతికూలతలన్నింటినీ ఎదుర్కొంటూ ‘దేవర’ థియేటర్ల వద్ద మంచి వసూళ్లు సాధించింది. సినిమా నెల రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమై బయ్యర్లకు లాభాలు అందించింది.
Devara Faces Backlash on OTT – Will This Impact Devara 2
అయితే, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందనను పొందిన ‘దేవర,’ ఓటీటీ విడుదల తర్వాత మాత్రం ఆ ప్రశంసల్ని నిలుపుకోలేకపోయింది. థియేటర్ సమయంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన నెగటివిటీని ఫ్యాన్స్ ధైర్యంగా ఎదుర్కొనగలిగారు. కానీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో సినిమా అందుబాటులోకి వచ్చాక, నెగటివిటీ మరింత పెరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ విమర్శలు ఎక్కువగా తారక్ అభిమానుల నుంచే రావడం గమనించవచ్చు. సినిమా క్లైమాక్స్ బలహీనంగా ఉందని, సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ నిరాశ కలిగించిందని వారు స్వయంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kaliyugam 2064: “కలియుగమ్ 2064” ఫస్ట్ లుక్ విడుదల
‘దేవర-2’ పై అభిమానుల్లో నెలకొన్న ఆవేదన ఎక్కువగా వారి అంచనాలకు తగిన స్థాయిలో ఫస్ట్ పార్ట్ లేకపోవడమేనని స్పష్టమవుతోంది. థియేటర్లలో చిత్రాన్ని విజయవంతం చేసేందుకు అభిమానులు మద్ధతు ఇచ్చినా, సీక్వెల్ పట్ల మాత్రం వాళ్లు చాలా రిజర్వ్‌గా ఉన్నారు. ‘దేవర-2’ కూడా ఇదే తరహా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమవుతుందని, అవసరమైతే సీక్వెల్ తీయకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.