Devara: తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఎంతగా ఆదరిస్తారో అందరికి తెలిసిందే. అయితే తమిళనాట మన సినిమాలకు అంత ఆదరణ దొరుకుతుందా అన్నది చర్చనీయాంశం. మనం తమిళ నటుల సినిమాలను ఆదరించినంతగా, తమిళ ప్రేక్షకులు మన సినిమాలను ఆదరిస్తారా అనేది ఇప్పటికే చెప్పలేం. విజయ్ సినిమా ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తెలుగులో ఎంత పెద్ద స్థాయిలో విడుదల అయిందో అందరికీ తెలుసు.
Devara: Will Tamil Audiences Embrace This Telugu Blockbuster
అర్ధరాత్రి షోలు, తెల్లవారుజామున షోలు అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. మనం తమిళ చిత్రాలను ఇంతగా ఆదరించడం చూస్తుంటే, తమిళుల దృష్టిలో మన సినిమాల ప్రాధాన్యత ఎంత ఉంది అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రేక్షకాదరణ పొందాలంటే, ముందుగా మంచి విడుదల మరియు థియేటర్ల కేటాయింపు ఉండాలి. కానీ, తమిళనాట మన సినిమాలకు తగినంత థియేటర్లు దొరకడం చాలా కష్టం.
Also Read: Devara: దేవర ప్రభంజనం.. తుడిచిపెట్టుకుపోతున్న ప్రభాస్ రికార్డ్స్!!
రాజమౌళి, ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మినహా, ఇతర తెలుగు సినిమాలకు తమిళనాట పోటీ ఎక్కువ. ‘దేవర’ సినిమాకు మంచి బజ్ ఉన్నప్పటికీ, ఈ వారం కార్తీ సినిమా ‘మెయ్యళగన్’ విడుదల అవ్వడం వల్ల థియేటర్ల పోటీ తీవ్రంగా ఉంది. కార్తి సినిమాకు అంత పెద్ద హైప్ లేకపోయినప్పటికీ, ‘దేవర’కు సింగిల్ స్క్రీన్లు మాత్రమే దొరికే అవకాశం ఉంది. మల్టీప్లెక్సుల్లో కూడా ఆశించిన స్థాయిలో స్క్రీన్లు లభించట్లేదు.
సినిమాకు హైప్ ఉన్నప్పటికీ, థియేటర్ల సంఖ్య తక్కువ కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక, కార్తి చిత్రం తెలుగులోనూ విడుదల అవుతుండడం వల్ల, ఆ చిత్రానికి మంచి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. మనం వారి సినిమాలను ఇంతగా ఆదరిస్తుంటే, వారు మన సినిమాలను ఇంత తక్కువగా ఆదరిస్తుండటం అన్యాయమే.