Dhanush: ఏంటి ధనుష్ ఐశ్వర్య మళ్ళీ కలవబోతున్నారా..ఇంతకంటే గుడ్ న్యూస్ ఉంటుందా అనుకుంటారు ఈ విషయం విన్న ధనుష్ రజినీకాంత్ అభిమానులు.. మరి నిజంగానే ధనుష్ ఐశ్వర్యలు విడాకులు రద్దు చేసుకోబోతున్నారా.. వీరి విడాకులు రద్దు వేసుకోబోతున్నట్టు వార్తలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Dhanush is going to reunite with Aishwarya with that condition
ధనుష్ ఐశ్వర్యలు విడాకులు రద్దు చేసుకోబోతున్నారు అని వచ్చే వార్తలకు కారణం తాజాగా అంటే అక్టోబర్ 7న వీరి విడాకుల కి సంబంధించిన విచారణ ఉందట. కానీ ఈ ఇద్దరు విచారణకు హాజరు కాకపోవడంతో వీరికి విడాకులు తీసుకునే ఉద్దేశం లేదని మళ్లీ కలిసిపోయే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కోలీవుడ్ లో ఊపందుకున్నాయి.(Dhanush)
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ పెళ్లికి ముందే ఆ హీరో ప్రియురాలిని ప్రేమించారా..?
అయితే కొంతమందేమో వీళ్ళిద్దరూ తమ పర్సనల్ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోతున్నారు అంటే మరి కొంతమందేమో పర్సనల్ పనులు అంటే ఇద్దరికి ఒకేసారి ఉంటాయా.. ఎవరో ఒకరు హాజరయ్యేవారు కదా.. ఇద్దరు రాలేదంటే ఇందులో వేరే మతలబ్ ఉండది అని అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కానీ అభిమానులు మాత్రం వీరిద్దరు పిల్లల కోసమైనా మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు.అయితే కోలీవుడ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రజినీకాంత్ ఒత్తిడి చేయడంతో ఇద్దరు తమ పిల్లల కోసం మళ్లీ కలవాలని నిర్ణయం తీసుకున్నారట.కానీ కొన్ని కండిషన్స్ పెట్టుకొని మళ్ళీ వీళ్లిద్దరు భార్యాభర్తలు గా మారబోతున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ ఈ జంట మళ్ళీ కలవాలని మనం కూడా కోరుకుందాం.(Dhanush)