Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ అభిషేక్ లది ప్రేమ వివాహం.. అయితే వీరిద్దరు ప్రేమలో పడక ముందు సల్మాన్ ఖాన్,వివేక్ ఓబెరాయ్ వంటి హీరోలతో ఐశ్వర్య ప్రేమాయణం నడిపింది. అలాగే అభిషేక్ బచ్చన్ కూడా కరిష్మా కపూర్ తో పప్రేమాయణం సాగించారు.ఇక సల్మాన్ ఖాన్ తో పెళ్ళి వరకు ఐశ్వర్య వెళ్తే కరిష్మా కపూర్ తో కూడా అభిషేక్ బచ్చన్ పెళ్లి వరకు వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకొని దాన్ని బ్రేక్ చేసుకున్నారు. అలా వీరిద్దరికి పెళ్లికి ముందే రిలేషన్స్ ఉన్నాయి..
Did Aishwarya Rai secretly marry that hero.. even for honeymoon there
అయితే అప్పట్లో ఓ వార్త బాలీవుడ్ మీడియాలో దుమారం సృష్టించింది. మరి ఇంతకీ ఆ వార్త ఏంటయ్యా అంటే.. ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫ్యామిలీకి కోడలుగా వెళ్లేకంటే ముందే మరో నటుడిని రహస్య వివాహం చేసుకుందని.. హనీమూన్ కోసం విదేశాలకు కూడా వెళ్లినట్టు ఫోటోలు, వీడియోలు కూడా కొన్ని మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఆ హీరో ఎవరో కాదు సల్మాన్ ఖాన్.. ఐశ్వర్య సల్మాన్ ల మధ్య ఎంత అనుబంధం ఉండేదో చెప్పనక్కర్లేదు.వీరిద్దరి మధ్య సినిమా షూటింగ్లో ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. (Aishwarya Rai )
Also Read: Kushboo: ఆ హీరో కి రెండో భార్య అవ్వాలనుకున్న కుష్బూ.. ఇంట్లో సీక్రెట్ గా పెళ్లి..?
కానీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ చిత్ర హింసలు పెట్టడంతో ఆయనకు బ్రేకప్ చెప్పి వివేక్ ఒబేరాయ్ తో కొద్దిరోజులు సాన్నిహిత్యంగా ఉంది ఐశ్వర్య. ఆ తర్వాత ఎప్పుడైతే అభిషేక్ బచ్చన్ కలిశారో అప్పటినుండి ఆయన ప్రేమలో మునిగిపోయింది. అలా అభిషేక్ ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరికి ఆరాద్య బచ్చన్ అనే కూతురు కూడా ఉంది. అయితే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడేకంటే ముందే సల్మాన్ ఖాన్ ని సీక్రెట్ గా వివాహం చేసుకొని అట్నుంచి అటే న్యూయార్క్ కి హనీమూన్ కి వెళ్ళింది అని ఒక రూమర్ చక్కర్లు కొట్టింది.
అయితే ఈ రూమర్ బాలీవుడ్ మొత్తం వ్యాపించడంతో వెంటనే ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య. ఓ ప్రెస్ మీట్ పెట్టి నేను రహస్య వివాహం చేసుకోలేదు. నాకు అలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే దాన్ని అందరికీ చెప్పి అంగరంగ వైభవంగా చేసుకుంటాను అంటూ ఐశ్వర్యరాయ్ పుకార్లకు చెక్ పెట్టింది.(Aishwarya Rai )