Kalki 2898 AD: ప్రస్తుతం ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా కల్కి 2898 AD సినిమా గురించి మాట్లాడుకుంటుంది. మరీ ముఖ్యంగా ఇండియన్ సినీ హిస్టరీలో కల్కి సినిమా ఒక సంచలనం సృష్టించింది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక అద్భుతమైన సినిమాను మన ముందుకు తీసుకువచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే అలాంటి ఈ కల్కి మూవీకి భారీ బడ్జెట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.
Did Prabhas take less remuneration for Kalki 2898 AD movie
దాదాపు 600 కోట్ల బడ్జెట్ ఈ మూవీకి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 600 కోట్ల కంటే ఎక్కువగానే ఈ మూవీకి బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో నటినటుల రెమ్యూనరేషనే ఎక్కువైందని చాలామంది భావిస్తున్నారు. ఇక ఇందులో ప్రభాస్ రెమ్యూనరేషన్ 150 కోట్లు అని ఆ మధ్యకాలంలో ఓ టాక్ వినిపించిన సంగతి మనకు తెలిసిందే.(Kalki 2898 AD)
అయితే తన ఒక్కో సినిమాకి 100 కోట్ల నుండి 150 కోట్లు వరకు రెమ్యూనరేషన్ అందుకునే ప్రభాస్ కల్కి సినిమాకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ కల్కి మూవీకి ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనుకుంటున్నారా అక్షరాల 80 కోట్లట.. అయితే మొన్నటి వరకు ఈయన రెమ్యూనరేషన్ 150 కోట్లనే రూమర్ వినిపించినప్పటికీ తాజాగా కల్కి విడుదలయ్యాక 80 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రభాస్ తీసుకునే 150 కోట్ల రెమ్యూనరేషన్ లో సగం పారితోషికం మాత్రమే ఈ సినిమాకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి అంత తక్కువ అమౌంట్ ప్రభాస్ ఎందుకు తీసుకున్నారు.. నిజంగానే 80 కోట్లు తీసుకున్నారా లేక ఇది కూడా రూమరేనా అనేది తెలియాల్సివుంది. ఇక ఈ సినిమా లో దీపిక పదుకొనే,అమితాబ్ బచ్చన్, కమలహాసన్ లకు 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. (Kalki 2898 AD)