Did Samantha Indirectly Blame Naga Chaitanya

Naga Chaitanya: సమంత రూత్ ప్రభు ఇటీవల చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. “నేను నిజ జీవితంలో ముందే స్పై చేయాల్సింది” అని ఆమె వ్యాఖ్యానించడంతో, ఆమె మాటలు తన మాజీ భర్త నాగ చైతన్యను పరోక్షంగా విమర్శించారని అభిమానులు భావిస్తున్నారు. సమంత ఆయన పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆమె వ్యాఖ్యల సమయం, సందర్భం చూసినప్పుడు, ఈ మాటలు ఆమె విడాకుల గురించి అయినట్లు స్పష్టమవుతోంది.

Did Samantha Indirectly Blame Naga Chaitanya

సమంత, నాగ చైతన్య 2021లో నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడిపోవడం టాలీవుడ్‌లో సంచలనానికి కారణమైంది. ఆ సమయంలో వీరి విడాకులు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇప్పుడు, సమంత తన వివాహ సంబంధంలో తాను చాలా అమాయకంగా, నమ్మకంగా ఉన్నానని, మరికొంత జాగ్రత్తగా ఉండాల్సిందని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లు అనిపిస్తోంది.

Also Read: Trisha: ఆ నటుడితో పెళ్లి ఫిక్స్.. ఫారిన్ లో త్రిష బ్యాచిలర్ పార్టీ..?

ఇలా, సమంత ఇంకా తన మాజీ భర్తపై కోపంగా ఉన్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా అన్నదని అర్థమవుతుంది. ఆమె మానసిక స్థితిని తెలియజేస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలు వారి విడాకులపై మరింత చర్చలకు దారితీశాయి. విడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ కారణాలను బయటపెట్టకపోవడంతో, వారి మధ్య జరిగిన విషయాలపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమంత తాజా వ్యాఖ్యలు ఆమె అభిమానులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆమె మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకోవడానికి ఒక సూచనగా మారాయి.