Prema: సీనియర్ నటి ప్రేమ అంటే అందరికీ సుపరిచితమే.ఈమె దేవి, దేవి అభయం,దేవి నాగమ్మ వంటి ఎన్నో సినిమాల్లో నాగమ్మ తల్లిగా నటించి టాలీవుడ్ లో ఎంతోమంచి గుర్తింపు సంపాదించింది.ఇక కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ,తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ జీవన్ అప్పచు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకుంది.
Did senior actress Prema divorce her husband for that hero
అయితే ప్రేమ తన భర్తతో విడాకులు తీసుకున్న సమయంలో ఆ హీరో కారణంగానే విడాకులు తీసుకుందనే టాక్ సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది.ఇక ఆ హీరో ఎవరో కాదు సీనియర్ నటుడు ఉపేంద్ర.. కన్నడ స్టార్ ఉపేంద్ర అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సూపరిచితమే. ఈయన హీరోగా..విలన్ గా..ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు. అయితే అలాంటి ఉపేంద్రతో ప్రేమ కొన్ని సినిమాల్లో నటించింది. (Prema)
Also Read: Chiranjeevi: చిరంజీవి మూవీ లో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిన హీరోయిన్.?
అలా నటించే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే రూమర్ ఇండస్ట్రీలో ఉంది. అంతేకాదు ప్రేమ తన భర్తకు విడాకులు ఇవ్వడానికి కూడా ఉపేంద్ర తో ఉన్న రిలేషనే అనే టాక్ కూడా వినిపించింది. అయితే ఇదే విషయంపై ప్రేమ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ పెళ్లి అనేది జీవితంలో చాలా పెద్ద విషయం.
కానీ అదే జీవితంలో పెద్ద ఇబ్బందిగా మారినప్పుడు దాన్ని వదిలేసుకోవడం మంచిది. అందుకే నేను డివోర్స్ తీసుకున్నాను. అలాగే ఉపేంద్ర తో ప్రేమ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అయితే మేమిద్దరం సినిమాల్లో కలిసి నటించాం.కానీ ఆ తర్వాత కలిసి మాట్లాడకుంది కూడా లేదు అంటూ ప్రేమ చెప్పుకొచ్చింది.(Prema)