Sobhitha: ఏంటి శోభిత ధూళిపాళ్లకి నాగచైతన్య కంటే ముందే మరో హీరోతో పెళ్లయిందా.. వినడానికే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్.. ఎందుకంటే శోభిత ధూళిపాళ్లకు నాగచైతన్య కంటే ముందే మరో లవర్ ఉన్నారని తెలుసు.. కానీ పెళ్లయింది అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఫొటోస్ చూస్తే మాత్రం చాలా మంది జనాలు నాగచైతన్య కంటే ముందు ఆ హీరోని శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకుంది..
Did Sobhitha get married to that hero before Chaitanya
చైతన్య మోసం చేస్తుంది అంటూ కామెంట్స్ పెట్టక తప్పదు.మరి ఇంతకీ నాగచైతన్య కంటే ముందు శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది.ఇక ఆ ఫోటోలో ఏముందంటే నాగచైతన్య కి కాబోయే భార్య శోభిత దూళిపాళ్ల పెళ్లికూతురుగా ముస్తాబైన ఫోటో.. కానీ ఆ ఫోటోలో ఆమె పక్కన పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నది నాగచైతన్య మాత్రం కాదు.మరో హీరో..(Sobhitha)
Also Read: Lavanya: రాజ్ తరుణ్ నేను ఇద్దరం కలిసే డ్రగ్స్ తీసుకున్నాం.. ట్విస్ట్ ఇచ్చిన లావణ్య..?
ఆయన ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..అవును మీరు వినేది నిజమే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శోభిత దూళిపాళ్ల ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా కూర్చుని ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట దుమారం సృష్టిస్తుంది.. అసలు ఈ ఫోటో ఏంటి.. నిజంగానే రామ్ చరణ్ శోభిత దూలిపాళ్లలు పెళ్లి చేసుకున్నారా..అని ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి అనుమానం రాక తప్పదు.అయితే మీరు కూడా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
ఎందుకంటే వీరిద్దరిది నిజమైన పెళ్లి కాదు.కేవలం ఒక యాడ్ కోసం వీరిద్దరూ కలిసి నటించారు. మాన్యవర్ అనే పెళ్లి దుస్తులకు సంబంధించిన కంపెనీ యాడ్లో శోభిత రామ్ చరణ్ లు కలిసి నటించారు. అలా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటించిన ఆ యాడ్ కి సంబంధించిన వీడియోలు,ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో సడన్గా చూసిన కొంతమంది నెటిజన్స్ వీరిద్దరికి పెళ్లి అవ్వడం ఏంటి అని షాక్ అవుతున్నారు. కానీ వీరు మాత్రం ఓ వ్యాపార ప్రకటనలో కలిసి నటించారు.(Sobhitha)