Rahul Gandhi: దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన వారిలో మెయిన్ గా గాంధీ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీద్వారా దేశాన్ని దాదాపు చాలా సంవత్సరాలు పరిపాలించారు. అలాంటి గాంధీ ఫ్యామిలీ నుండి ప్రస్తుతం సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అయితే 50 ఏళ్లు దాటినా కూడా రాహుల్ గాంధీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ అప్పట్లో ఓ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడిందట.మరి ఆమే ఎవరా అనుకుంటున్నారా..
Did that heroine love Rahul Gandhi so much
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి సైఫ్ అలిఖాన్ భార్య కరీనాకపూర్.. అసలు విషయం ఏమిటంటే.. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పటినుండే కపూర్ ఫ్యామిలీకి గాంధీ ఫ్యామిలీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదట.ఈ అనుబంధం తోనే రాజీవ్ గాంధీ కి రాజ్ కపూర్ కూతురు రీతూ కపూర్ ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. కానీ అప్పటికే రాజీవ్ గాంధీ సోనియా గాంధీతో ప్రేమలో ఉండడం వల్ల ఇది కుదరలేదు. (Rahul Gandhi )
Also Read: Nivetha Pethuraj: లవ్ లో ఫెయిల్ అయిన నివేదా పేతురాజ్.. అందుకే ఆ హీరో ని దూరం పెడుతుందా ..?
ఆ తర్వాత రాజ్ కపూర్ మనవరాలు కరీనాకపూర్ కి రాహుల్ గాంధీ అంటే పిచ్చి ఇష్టం అంట.అంతేకాదు ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మీకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అని అంటే ఆలోచించకుండా టక్కున రాహుల్ గాంధీ పేరు చెప్పిందట. అలాగే రాహుల్ గాంధీకి కూడా కరీనాకపూర్ అంటే ఇష్టం ఉండేదట. కానీ ఆయన అంతగా బయట పెట్టలేదట. అంతేకాదు కరీనాకపూర్ సినిమాలు విడుదలైతే ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా చూసేవారట అంత ప్రేమ..
కానీ క్రమక్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గిపోయింది కావచ్చు.ఎందుకంటే సినిమాల్లో బిజీ అయి కరీనా రాజకీయలో బిజీ అయ్యి రాహుల్ పెళ్లికి దూరమయ్యారు.ఆ తర్వాత కరీనాకపూర్ సైఫ్ అలీ ఖాన్ తో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పటికి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తన నేతా అభినేతా అనే పుస్తకంలో రాసుకున్నారు.(Rahul Gandhi )