Vijay: కోలీవుడ్ హీరో విజయ్ జీవితం ఏమలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు. ఈయన జీవితంలో ఎన్నో అనూహ్య సంఘటనలు ఎదురవుతున్నాయి.గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న విజయ్ రీసెంట్గా పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. కానీ జెండా ఆవిష్కరణ సమయంలో భార్య పిల్లలు కనిపించలేదు.
Did those two heroines together destroy Vijay married life
అలాగే రీసెంట్గా విజయ్ కొడుకు జోసెఫ్ సంజయ్ దర్శకుడిగా లైకా సంస్థ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అంతేకాదు సంజయ్ దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమాకి సందీప్ కిషన్ హీరోగా కూడా ఫిక్స్ అయ్యారు. అయితే విజయ్ కి కొడుకు డైరెక్టర్ అవ్వడం ఏమాత్రం ఇష్టం లేదట ఈ విషయాన్ని విజయ్ ఫ్యామిలీతో కలిసి ఉన్న సమయంలోనే చెప్పారట.కానీ ఇప్పుడు విజయ్ ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నారు.(Vijay)
Also Read: Trisha: విజయ్ పై ప్రేమతో కాదు.. కోటికి పైగానే కొట్టేసిన త్రిష..?
కాబట్టి ఆయన భార్య సంగీత విజయ్ పై పగబట్టి మరీ కొడుకుని తండ్రికి వ్యతిరేకంగా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పంపిస్తోందని ప్రస్తుతం కోలీవుడ్లో చర్చ జరుగుతుంది. అంతేకాదు విజయ్ ఇలా ఫ్యామిలీని పట్టించుకోకుండా పెడదారి పట్టడానికి కారణం విజయ్ మేనేజర్ అని తెలుసుకున్న విజయ్ కొడుకు సంజయ్ విజయ్ మేనేజర్ పై దాడి కూడా చేసినట్టు టాక్ వినిపిస్తోంది.అలాగే ఓ ఇద్దరు హీరోయిన్లు కలిసి విజయ్ జీవితాన్ని నిండా ముంచేసారంటూ కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఇక ఆ హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్ మరొకరు త్రిష అని ప్రచారం జరుగుతుంది.అంతేకాదు రీసెంట్ గా ఆయన పార్టీ టీవీకే ఫుల్ ఫామ్ త్రిష, విజయ్, కీర్తి సురేష్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు హీరోయిన్లతో విజయ్ డేటింగ్ వార్తలు మాత్రం ఆయన కాపురంలో చిచ్చుపెట్టాయని అర్థమవుతుంది.మరి విజయ్ జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.(Vijay)