Devara: ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 న విడుదలైన దేవర సినిమాపై మొదటిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే కొంతమంది మాత్రం పని కట్టుకొని దేవర సినిమాపై నెగటివ్ టాక్స్ స్ప్రెడ్ చేశారు.కానీ సినిమాలో కథా కంటెంట్ బాగుంటే ఎవరు ఎన్ని నెగటివ్ ప్రచారాలు చేసినా కూడా సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే తాజాగా విడుదలైన దేవర మూవీపై కూడా నెగిటివిటీ వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది.
Did you know that TV actress who played Saif Ali Khan wife in Devara
ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చాలామంది భావిస్తున్నారు.అయితే ఒక సినిమా విడుదలైందంటే ఆ సినిమాలో ఎవరైనా తెలియని క్యారెక్టర్లు ఉంటే ఆ నటి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆ నటుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా రిలీజైన దేవర మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. (Devara)
Also Read: Devara Collections: ఫ్లాప్ టాక్ తోనూ ‘దేవర’ తొలి రోజు అన్ని కోట్లు సాధించిందా!!
ఇక విలన్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో నటించిన ఆ నటిని మీరు గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు బుల్లితెర నటి.. స్టార్ మా లో ప్రచారమైన అష్టా చమ్మ సీరియల్లో ఈ నటి చేసింది.అలాగే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, దటీజ్ మహాలక్ష్మి వంటి సీరియల్స్ లో కూడా నటించింది.ప్రస్తుతం చైత్ర రాయ్ జీ తెలుగులో ప్రసారమయ్యే రాధకు నీవేరా ప్రాణం అనే సీరియల్ లో నటిస్తుంది.
అయితే అలాంటి చైత్ర రాయ్ కి దేవర వంటి పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ సరసన భార్య పాత్రలో నటించింది. ఇక ఇలాంటి పెద్ద సినిమాలో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు.కానీ చైత్ర రాయ్ కి ఈ అవకాశం రావడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.(Devara)