Bunny: గత కొద్దిరోజుల నుండి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం గురించి ఎన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై పీకల్లోతు కోపం పెంచుకున్నారు. ఎప్పుడైతే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూనే తన ఫ్రెండ్ అయినటువంటి వైసిపి అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేశారో అప్పటినుండి ఇరు కుటుంబాల మధ్య గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.
Director sensational comments on Bunny
కానీ మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వాళ్ళు మాత్రం అలాంటి గొడవ ఏమీ లేదు కేవలం బయట వచ్చే రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇస్తున్నారు.అయితే తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ అల్లు అర్జున్ పై సంచలన కామెంట్స్ చేశారు.. గీత కృష్ణ మాట్లాడుతూ.. బన్నీ సినిమాల పిచ్చితో సోషల్ మీడియా పిచ్చితో పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి తన పేరు ఎప్పుడు నెట్టింట్లో హైలెట్ గా ఉండాలని చూస్తున్నారు.కానీ ఆయన మొదటిసారి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వెళ్లి పెద్ద తప్పు చేశారు.(Bunny)
Also Read: Vishwak Sen: ఆ హీరోయిన్ వల్లే విశ్వక్ సేన్ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారా..?
ప్రస్తుతం పవన్ ఇమేజ్ చిరంజీవి ఇమేజ్ ని మించిపోయింది. ఇలాంటి సమయంలో పవన్ కి వ్యతిరేకంగా వైసిపి అభ్యర్థికి సపోర్ట్ చేసి బన్నీ పెద్ద తప్పు చేశారు.బన్నీ ఇప్పటికైనా సరే ఓ ప్రెస్ మీట్ పెట్టి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అని సర్ది చెబితేనే ఈ గొడవలు ఆగుతాయి. లేకపోతే పుష్ప-3 నిర్మించే నిర్మాతలకి నిరాశ తప్పదు. బన్నీ ప్రవర్తన వల్ల నిర్మాతలు ఇబ్బందుల పాలవుతారు.
మా మధ్య ఏమీ లేదని బన్నీ చెబితేనే నిర్మాతలు గట్టున పడతారు అంటూ గీత కృష్ణ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే పుష్ప -3 వాయిదా వేయడానికి కారణం మెగా అభిమానులు అల్లు అర్జున్ పై చేసే ట్రోలింగేనని ఈ సమయంలో పుష్ప -3 సినిమాను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అభిమానులు కక్ష కట్టి ప్లాఫ్ చేస్తారు అనే ఉద్దేశంతోనే ఈ సినిమాని వాయిదా వేసినట్టు టాక్ వినిపిస్తోంది.(Bunny)