Heroine: ఏంటి ఆ హీరోయిన్ కి 600 కోట్ల ఆస్తి..అది కూడా ఓ డైరెక్టర్ ఇస్తానని మాట ఇచ్చారా.. మరి ఇంతకీ 600 కోట్లు ఇస్తానన్నా రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరోయిన్ కి డైరెక్టర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా అంటే అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా,మహేష్ బాబుతో రాజకుమారుడు వంటి సినిమాల్లో చేసింది.
Director who will give 600 crore property to Heroine but
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకు ఓ డైరెక్టర్ ఆరు వందల కోట్లు ఇస్తానన్నారట. అయితే ఆమె నుండి వేరే ఏదో ఆశించి ఆ డైరెక్టర్ ఇస్తాను అనలేదు.ఆమెను తన సొంత కూతురిలా భావించి దత్తత తీసుకొని 600 కోట్లు ఇస్తానన్నారట.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు బాలీవుడ్ దర్శకుడు షాందర్ ఆమ్రోహి.. అయితే ప్రీతి జింతా ని తన సొంత కూతురిలా భావించి ఆమెకు 600 కోట్ల ఆస్తిని రాసిచ్చాడనే రూమర్ అప్పట్లో వైరల్ అయింది. (Heroine)
Also Read: Ram Charan: సీనియర్ హీరోయిన్ తో రామ్ చరణ్ అన్నయ్య రెండో పెళ్లి.?
అయితే 600 కోట్ల ఆస్తిని ప్రీతిజింతా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అంతేకాదు గతంలో ఆ డైరెక్టర్ ప్రీతిజింతా ని దత్తత తీసుకున్నాడు అనే రూమర్స్ వినిపించడంతో ప్రీతి జింతా తనదైన శైలిలో స్పందించి దత్తత తీసుకున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.ఈ వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు షాందర్ ఆమ్రోహికి నేను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడంతో ఆయన నన్ను కూతురిగా భావించారు.
కానీ నేను వేరే వాళ్ళు ఇచ్చే ఆస్తికి ఆశపడి ఎప్పుడూ లేను. వాళ్లు ఆస్తి ఇస్తే అనుభవించేంత దుస్థితిలో నేను లేను. నా జీవితంలో మా నాన్న స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేను అంటూ సంచలన కామెంట్స్ చేసింది.కానీ చనిపోయిన సమయంలో మాత్రం ప్రీతి జింతాకి షాందర్ వారసులకి మధ్య ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయి అంటూ ఒక రూమర్ వినిపించింది.ఇక 600 కోట్ల ఆస్తి ఇస్తానన్నా కూడా ప్రీతిజింతా నాకు వద్దని మొహం మీదే చెప్పేయడం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.(Heroine)