Divorce: టాలీవుడ్ లో ఉండే యంగ్ ఆ హీరో నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా.. పెళ్ళై మూడేళ్లు కాకముందే అప్పుడే విడాకులా ..ఇంతకీ విడాకులు తీసుకోవాలనుకుంటున్న ఆ హీరో ఎవరు? సోషల్ మీడియా వినిపిస్తున్న ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఈ హీరో ఇండస్ట్రీకి చిన్న హీరోగా వచ్చి ఆ తర్వాత ఒక లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాతో పెద్ద హీరోగా మారిపోయారు.
Divorce of a young hero in Tollywood
అయితే ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ఈయన సినీ కెరియర్ అంతంత మాత్రం గానే ఉంది.ఇక గత కొద్దిరోజుల నుండి మళ్ళీ ఆయన సక్సెస్ బాట పట్టి మళ్ళీ ఒక పెద్ద హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాత ఈయన చేసిన సినిమాలేవి అంతగా హిట్ అవడం లేదు.దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఈ హీరో హిట్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్ గానే డైరెక్టర్ తో సినిమా అనుకొని మధ్యలోనే ఆగిపోయింది. (Divorce)
Also Read: Rukmini Vasanth: ఎన్టీఆర్ మూవీలో చేయబోతున్న రుక్మిణి వసంత్ కి ఇంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉందా..?
అలాగే ప్రస్తుతం ఆయన చేతిలో ఓ స్టార్ డైరెక్టర్ మూవీ ఉంది. కానీ ఆ సినిమా హిట్ అవుతుందో లేదో అనే నమ్మకం ఆయనకి కూడా లేదు.దీంతో సక్సెస్ కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్న ఈ హీరోకి అర్జెంటుగా ఒక భారీ హిట్ కావాలి అని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ హీరో భార్య ఈయనకు వచ్చిన ఫ్లాప్ సినిమాలను పదేపదే ఎత్తి చూపుతూ హేళనగా మాట్లాడుతూ అవమానిస్తుందట.
దీంతో పాటు బయట సరిగ్గా లేక ఇటు ఇంట్లో సరిగ్గా లేక ఆ హీరో డిప్రెషన్ లోకి వెళ్లడంతో చివరికి తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.మరి నిజంగానే ఆ యంగ్ హీరో విడాకులు తీసుకోబోతున్నారా.. అంటే కొంతమంది సన్నిహిత వర్గాలు నిజమే అంటున్నారు. ఇక ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఆ హీరో ఎవరు ఆ వివరాలు ఏంటి అనేది త్వరలోనే బయటపడబోతున్నాయి.(Divorce)