Car: ఈరోజుల్లో సులువుగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్లాలంటే ఈజీగా మనం కారులో వెళ్లి వచ్చేయొచ్చు. కారు ప్రయాణం చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది దూర ప్రయాణాలు కూడా కారులో చేయడానికి కంఫర్ట్ గా ఉంటుంది. అయితే కారు ఉన్నప్పటికీ కొన్ని తప్పులు చేయడం వలన ప్రమాదం కలగచ్చు పొరపాటున కూడా కారులో ఈ వస్తువులనే ఉంచకూడదు. పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. వాహనం అగ్నికి ఆహుతైన సంఘటనలో మీరు తరచుగా వినే ఉంటారు ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. తీవ్రమైన వేడిలో ఇలాంటి ప్రమాదాలు మరింత రెట్టింపు అవుతాయి.
Do not keep these in Car
తరచుగా ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ లేదా అనేక ఇతర సాంకేతిక కారణాల వలన జరుగుతున్నాయి కార్లలో కొన్ని వస్తువుల్ని తీసుకెళ్లకపోవడమే మంచిది. లేదంటే అనవసరంగా ప్రమాదంలో పడొచ్చు. కారులో నీళ్లు తాగడానికి ప్లాస్టిక్ బాటిల్స్ తరచుగా వాడుతూ ఉంటాం ఒకటి లేదా ఇంకో బాటిల్ ఎప్పుడూ కారులో పడి ఉంటుంది కానీ చిన్న ప్లాస్టిక్ బాటిల్ మీ కారులో పెద్ద ప్రమాదానికి కారణం అవ్వచ్చు. వేసవిలో కారు లోపల అస్సలు ప్లాస్టిక్ బాటిల్స్ ని ఉంచకండి ప్లాస్టిక్ బాటిల్స్ వలన మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. వాహనంలో మంటలు చెల్లరేగితే అది మీ వాహనం అంతటా వ్యాపిస్తుంది. కనుక స్టీల్ లేదా గాజు సీసాలను వాడడం మంచిది.
Also read: SLBC Meeting: ఈరోజు బ్యాంకర్ల కమిటీ సమావేశం…!
ఇదే కాదు మన కారులో ఉంచకుండా ఉండాల్సిన మరి కొన్ని వస్తువులు కూడా వున్నాయి. సిగరెట్ వెలిగించడానికి లైటర్ ఉపయోగిస్తే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కారులో లైటర్ ని ఎప్పుడు ఉంచకండి. నిజానికి లైటర్ పై సూర్య రష్మి పడితే అది పెద్ద పేలుడుకు కారణం అవుతుంది. సువాసన కోసం కారులో డియోడ్రెంట్ ని ఉంచకుండా చూసుకోండి ఇది టెంపరేచర్ సెన్సిటివ్ అంటే ఉష్ణోగ్రత కాస్త పెరిగితే పేలుడు ప్రమాదం ఉంటుంది కారులో పొరపాటున కూడా శానిటైజర్ ఉంచకండి. వాహనంలో శానిటైజర్ ఉంచడం వలన అగ్నిప్రమాదం జరగచ్చు. ముఖ్యంగా సూర్య కాంతిలో ప్రత్యక్ష సంబంధంలో ఉంచొద్దు అలాగే మీ వాహనంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచకండి వాస్తవానికి వేసవిలో ఈ ఉపకరణాలు మంటలు అంటుకునే ప్రమాదం ఎక్కువ (Car).