Sridevi: ఇండియన్ సినీ ఇండస్ట్రీని తన అంద చందాలతో,నటనతో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లలో దివంగత నటి శ్రీదేవి కూడా ఒకరు. ఈమె తెలుగు సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాలనటిగా ఎంతోమందిని తన క్యూట్ నటనతో పడగొట్టేసి ఆ తర్వాత చిన్న ఏజ్ లోనే హీరోయిన్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోలతో పదులకొద్దీ సినిమాల్లో నటించింది.ఇక సౌత్‌లో స్టార్ హీరోయిన్ అయ్యాక బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా స్టార్ నటిగా రాణించింది. ఆమె ఏజ్ పెరిగినా కూడా ఏమాత్రం అందం తగ్గకుండా ఒకేరకమైన కటౌట్ ని మెయింటెన్ చేస్తూ ఎంతో మంది అభిమానులని తన అందంతో మెస్మరైజ్ చేసింది.
Does Sridevi have a third daughter
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బోనీ కపూర్ ని పెళ్లి చేసుకొని జాన్వి కపూర్, ఖుషి కపూర్ లకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక బోనీ కపూర్ కి ఇది రెండో పెళ్లి.అయితే శ్రీదేవి కి జాన్వి, ఖుషి ఇద్దరు పిల్లలు మాత్రమే కాకుండా మరో కూతురు కూడా ఉంది అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఒక అమ్మాయి పేరు వైరల్ అవుతుంది.. మరి ఇంతకీ శ్రీదేవి కి ఉన్న ఆ రహస్య కూతురు ఎవరు.. ఆమె శ్రీదేవికి ఎలా కూతురు అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. శ్రీదేవి మూడో కూతురు అంటూ నెట్టింట్లో వైరల్ అవుతున్న అమ్మాయి ఎవరో కాదు శ్రీదేవితో కలిసి “మామ్” అనే సినిమాలో కలిసి నటించిన సజల్ అలీ.( Sridevi)
Also Read: Kushboo: కుష్బూ పెళ్లి జరగడానికి కారణం ఆ హీరోయిన్ నేనట.?
ఈ సినిమాలో శ్రీదేవి కూతురుగా సజల్ అలీ నటించింది.ఇక ఈ సినిమా షూటింగ్ సమయం నుండి సజల్ అలీకి శ్రీదేవికి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట.అలా వీరిద్దరూ తల్లి కూతుర్లలాగే ఉన్నారట. అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సజల్ అలీ నా మూడో కూతురు అని తెలియజేసింది.అయితే సజల్ అలీ తల్లి చనిపోవడంతో శ్రీదేవి ఎమోషనల్ అయ్యి ఇప్పటినుండి సజల్ అలీ నా మూడో కూతురు అంటూ చెప్పింది.ఇక సజల్ అలీ కూడా శ్రీదేవిని తన తల్లిలాగే భావించింది. వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ కొనసాగుతున్న సమయంలోనే హఠాత్తుగా శ్రీదేవి మరణం ఆమెని ఎంతగానో కలిచి వేసిందట.
ఓ ఇంటర్వ్యూలో సజల్ అలీ మాట్లాడుతూ..నాకు శ్రీదేవి అమ్మ దుబాయ్ వెళ్లిన సమయంలో ఐ మిస్ యు బేటా అనే మెసేజ్ పెట్టింది.అదే చివరి మెసేజ్. చాలాసార్లు మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవాలి అని చూసినప్పటికీ బిజీ షెడ్యూల్ వల్ల మాట్లాడుకోలేకపోయాం.. అలాగే నేను ఓ రోజు సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో శ్రీదేవి గారు నాకు ఫోన్ చేశారు. కానీ షూటింగ్ బిజీ వల్ల నేను రెస్పాండ్ అవ్వలేదు.ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ చేశాను. ఆమె చనిపోయిన సమయంలో నేను మళ్ళీ నా తల్లిని కోల్పోయాను అని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకున్నాను..అంటూ సజల్ అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇక అప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో శ్రీదేవి మూడో కూతురు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.( Sridevi)