Double Ismart: రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ వీదలేడనే చెప్పాలి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నప్పటికీ ఆగస్టు 15వ తేదీన సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ విడుదల అనేది జరుగుతుందో లేదో అన్న అనుమానాలను సినిమా విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. దానికి కారణం పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ డిస్ట్రిబ్యూటర్లే అని తెలుస్తుంది.
Double Ismart: Distributor Conflicts Cast Doubt on August 15 Release
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఆర్థికంగా చాలా విఫలమయింది. భారీ అంచనాల నేపథ్యంలో మంచి బిజినెస్ జరిగిన ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి భారీ నష్టమే వచ్చి పడిందని చెప్పాలి. నిర్మాత చార్మీ కి వ్యతిరేకంగా ధర్నా చేసినా కూడా ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించి వచ్చే సినిమాలో చూసుకుందామని ఆమె చెప్పిందట. అయితే ఇప్పుడు ఆ మాటను కూడా తప్పుతున్నట్లు తెలుస్తుంది. వీరికి కాకుండా మరో వేరే డిస్ట్రిబ్యూటర్లకు సినిమాలను అమ్మడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Game Changer: “గేమ్ చేంజర్” ఎఫెక్ట్.. వెనక్కి జరుగుతున్న RC16!!
ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సినిమాకు తరలి రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆయన సినిమాలను కొనడానికి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాలకు పెద్దగా క్రేజ్ లేదు. అందుకే చాలా జాగ్రత్తగా సినిమాలు చేసి విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్. కానీ కొన్నిసార్లు ఎంత ప్లాన్ చేసినా కూడా అది సక్సెస్ కాదు. ఆ విధంగానే లైగర్ విషయంలో కూడా జరిగింది.
ఈ నేపథ్యంలోనే లైగర్ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు తమ విషయాన్ని సెటిల్ చేయకుండా ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని విడుదల చేయడం జరగని పని అని వారు చెబుతున్నారు. మరి విడుదలకు ముందే దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నిర్మాత చార్మి ఈ విషయాన్ని సెటిల్ చేసుకొని డబల్ ఇస్మార్ట్ సినిమాకు క్లియరెన్స్ తీసుకువస్తారా అనేది చూడాలి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అన్నీ కూడా చేసిన నేపథ్యంలో వారు ముందుగానే వారితో తేల్చుకుంటే మంచిదని అందరూ చెబుతున్నారు.