Double Ismart: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎదిగి ప్రేక్షకుల మనసులో రాక్ స్టార్ గా ముద్ర వేసుకున్నాడు హీరో రామ్ పోతినేని. అయన మొదటి చిత్రం ‘దేవదాస్’ దగ్గరినుంచి ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చారు. ఆమధ్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఆయనను మళ్ళీ ఫాం లో కి తెచ్చింది. ఇక ఇప్పుడు అదే దర్శకుడితో ‘డబల్ ఇస్మార్ట్’ సినిమా చేసిన విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ స్థాయి లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతూ ఉండగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవడం విశేషం.
Double Ismart movie release problems
ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని ఇటు పూరి అటు రామ్ ఎదురుచూస్తున్నారు. వీరిద్దరికి కూడా ఇప్పుడు విజయం రావడం అనేది తప్పనిసరి అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక చర్చ బాగా వైరల్ గా మారుతుంది. పూరి జగన్నాథ్ గత సినిమా ‘లైగర్’ సమయంలో ఎన్నో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిర్మాత చార్మి ఈ సినిమాను విడుదల చేస్తున్నారని కొంతమంది చెబుతుండగా, లైగర్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు అడ్డుపడే విధంగా ఆలోచనలు చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు.
Also Read: Prabhas: ప్రభాస్ ఇంట్రెస్ట్ అంతా దానిపైనే ఉందిగా!!
‘లైగర్’ సినిమా ద్వారా ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమకు కొంత డబ్బు ఇవ్వాలని మేకర్స్ ను వారు అడగగా నిర్మాతలు దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. వచ్చే సినిమాతో దాన్ని భర్తీ చేస్తామని చెప్పి అప్పుడు తప్పించుకోగా ఈ సినిమా రిలీజ్ సమయంలో సదరు డిస్ట్రిబ్యూటర్ ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా డైరెక్ట్ గా సినిమాను విడుదల చేయడం పట్ల వారు ఎంతో ఆగ్రహంగా ఉన్నారట.దాంతో ఈ సినిమా రిలీజ్ టైం లో అంతా ఒకటే పోరాడేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే కనుక నిజమైతే మళ్లీ ‘లైగర్’ వివాదం తెరపైకి రావడం ఖాయమని చెప్పాలి. ఇంకొక వైపు ఈ సినిమా పట్ల రామ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.