Dulquer - Kriti Shetty combo fix

Dulquar Salman: కొంతమంది ముద్దుగుమ్మలు ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోతూ ఉంటారు. అటువంటి వారిలో కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇక అనంతరం వరస సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ కాస్త టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చింది.

ఇటీవల శర్వానంద్ హీరోగా నటించిన.. మనమే చిత్రంలో మెరిసింది ఈ బ్యూటీ. ఇక తాజాగా కృతి శెట్టి ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవ్వరో కాదు.. మరియాల్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు దుల్కర్. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే దుల్కర్ ప్రెసెంట్ లక్కీ భాస్కర్ చిత్రంలో బిజీగా ఉన్నాడు.

Dulquer - Kriti Shetty combo fix

వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఇందులో యంగ్ అండ్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఇక సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లక్కీ భాస్కర్ ఇంకా రిలీజ్ కాకుండానే మరో సినిమాను లైన్లో పెట్టాడు దుల్కర్. తమిళ్ దర్శకుడు సెల్వామణి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ కృతి శెట్టిని ఎంచుకున్నారట. అంతేకాదు ఈ మూవీని టాలీవుడ్ స్టార్ హీరో రానా నిర్మించడంతో పాటు అందులో ఓ కీలక పాత్ర కూడా పోషించబోతున్నట్లు సమాచారం. ఇక దీనిపై అయితే ఇప్పటివరకు అఫీషియల్ క్లారిటీ రాలేదు.