Dulquer Salmaan Revealed About His Marriage

Dulquer Salmaan: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాడు. మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆయన, తెలుగులో కూడా బాగా గుర్తింపు పొందాడు. “మహానటి” చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన దుల్కర్, “సీతారామం” వంటి అద్భుతమైన ప్రేమకథతో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు. తాజాగా, దుల్కర్ “లక్కీ భాస్కర్” సినిమాతో దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, ఈ సినిమా బాగా ప్రశంసలు పొందుతోంది.

Dulquer Salmaan Revealed About His Marriage

“లక్కీ భాస్కర్” ప్రమోషన్లలో భాగంగా దుల్కర్, బాలయ్య హోస్ట్ చేస్తున్న “అన్‌స్టాపబుల్” టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో ఆయన తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. “అన్‌స్టాపబుల్” సీజన్ 4లో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారని, రెండవ ఎపిసోడ్‌లో “లక్కీ భాస్కర్” చిత్ర బృందం కనిపించింది. ఈ ఎపిసోడ్‌లో దుల్కర్‌తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కూడా ఉన్నారు.

Also Read: Natural Nani: గందరగోళంగా నేచురల్ స్టార్ నాని సినిమాల వరస!!

దీపావళి కానుకగా విడుదలైన ఈ ఎపిసోడ్‌లో దుల్కర్ తన ప్రేమకథను వివరించాడు. అతడు అమల్ సుఫియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. “అమల్ నా స్కూల్ జూనియర్. నేను 12వ తరగతిలో ఉన్నప్పుడు ఆమె 8వ తరగతి చదువుతున్నది. మేము కేవలం అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం. చెన్నైలో థియేటర్స్, రెస్టారెంట్లలో పలు సందర్భాలలో చూసేవాడిని. పెద్దగా పరిచయం లేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నప్పుడు, నేను ఆమెకు ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేసాను.

‘మీ ఇంట్లో కూడా చూస్తుంటారు, మనం కలిసి మాట్లాడుకుందామ’ అని కోరాను. ఆ తర్వాత మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం జరిగింది. మా పెళ్లి 13 సంవత్సరాలుగా ఉంది” అని దుల్కర్ వివరించాడు. దుల్కర్ చెప్పిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “అన్‌స్టాపబుల్” షోలో ఆయన పంచుకున్న ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి, దీంతో ఆయన అభిమానుల మధ్య మంచి చర్చనీయాంశంగా మారాయి.