Peddi Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… వైసిపి నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో… తెలుగు తమ్ముళ్లకు వైసీపీ నేతలు నరకం చూపించారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ రెడ్ బుక్ కూడా రెడీ చేసుకున్నాడు. ఈ రెడ్ బుక్కులో చాలామంది వైసిపి నేతల పేర్లు రాసుకున్నారు నారా లోకేష్. Peddi Reddy
Ex-Minister Peddireddy post of MLA canceled
ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పేర్లు అందులో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే.. పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతుంది కూటమి ప్రభుత్వం. అసలు వాళ్ళ సొంత నియోజకవర్గం అయిన పుంగనూరులో కూడా.. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అడుగుపెట్టకుండా టిడిపి నేతలు అడ్డుకుంటున్నారు. Peddi Reddy
Also Read: ABN Radhakrishna: తెలంగాణ అసెంబ్లీలో ABN రాధాకృష్ణ పెత్తనం..?
అయితే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కి మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన పై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో తన అఫిడవిట్ లో.. ఆస్తుల వివరాలు తప్పుగా పెద్దిరెడ్డి చూపించారని.. టిడిపికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆస్తులను చూపించలేదట. Peddi Reddy
ఒకవేళ ఈ పిటిషన్ పై హైకోర్టు సీరియస్ గా విచారణ చేసి యాక్షన్ తీసుకుంటే.. కచ్చితంగా పెద్దిరెడ్డి పైన చర్యలు తప్పవు. అంటే ఎమ్మెల్యే పదవిని పెద్దిరెడ్డి కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇలాంటి కేసులు… వాయిదా పడుతూ వస్తాయన్న సంగతి తెలిసిందే. అప్పటివరకు పెద్దిరెడ్డి ఐదు సంవత్సరాల పదవీకాలం కూడా అయిపోతుంది. మరి దీనిపై హైకోర్టు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. Peddi Reddy