RCB: ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఆర్సిబి విరాట్ కోహ్లీ, రజాత్ పాటిదార్, యష్ దయాల్ లను అట్టిపెట్టుకుంది. ఇప్పటికే రూ. 37 కోట్లను ఖర్చు చేసి ఆర్సిబి రూ. 83 కోట్లతో వేలంలోకి ప్రవేశించనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సిబి టార్గెట్ చేసిన ఆటగాళ్లు ఆరుగురు ఉన్నారు. వారు ఎవరు ఎవరు ఇప్పుడు చూద్దాం….

Former Players RCB Could Bring Back to Strengthen Their Squad

మహ్మద్ సిరాజ్

మహమ్మద్ సిరాజ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో 93 వికెట్లను పడగొట్టిన సత్తా కలిగిన వ్యక్తి మహ్మద్ సిరాజ్.

విల్ జాక్స్

విల్ జాక్స్ రెండవ స్థానంలో ఉంటాడు. ఈ ప్లేయర్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 230 పరుగులతో పాటు 2 వికెట్లను పడగొట్టాడు. ఇది కేవలం ఎనిమిది మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం.

అనూజ్ రావత్

అనూజ్ రావత్ కూడా ఆర్సిబి లిస్టులో చేరాడు. ఈ ఆటగాడు 5 ఐపీఎల్ మ్యాచుల్లో 127.27 స్ట్రైక్ రేటుతో 98 పరుగులను చేశాడు. ఫ్యూచర్ టీం లో భాగంగా ఈ ప్లేయర్ పై ఆర్సిబి పందెం వెయనుంది.

Also Read: Jagan: త్వరలోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూలబోతుంది.. టిడిపికి జగన్ వార్నింగ్ ?

గ్లెన్ మాక్స్వెల్

గ్లెన్ మాక్స్వెల్ పైన ఆర్సిబి ఇష్టాన్ని చూపిస్తోంది. ఈ డేంజరస్ ప్లేయర్ ఇప్పటివరకు ఆడిన 134 ఐపీఎల్ మ్యాచుల్లో 156.73 స్ట్రైక్ రేట్ తో 134 పరుగులు చేశాడు.

అశుతో ష్ శర్మ

ఇతడు కూడా ఆర్సిబి లిస్టులో చేరాడు. ఇప్పటివరకు 11 ఐపీఎల్ మ్యాచుల్లో 167.26 స్ట్రైక్ రేటుతో 189 పరుగులు సాధించాడు.

భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్ కూడా తాజాగా ఆర్సిబి లిస్టులో చేరినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో 176 మ్యాచులు ఆడిన ఈ పేసర్ 181 వికెట్లను పడగొట్టారు.