Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ రానున్నారనే విషయం దాదాపుగా కన్ఫామ్ అయింది. కానీ గంభీర్ వచ్చాక ఎలాంటి మార్పులు జరగనున్నాయనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధానంగా బీసీసీఐ ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పింది కేవలం ఒకటే. 2026 టీ20 వరల్డ్ కప్…. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని టీమ్స్ ను తయారుచేయాలి. ఇందుకోసం వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు ఉన్న పరవాలేదనే విషయాన్ని బోర్డు ముందు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారట గంభీర్. Gautam Gambhir
Gambhir as coach Kohli, Rohit out BCCI plan is this
అంటే టెస్ట్ కు విడిగా ఓ జట్టు….వన్డేలకు విడిగా మరో జుట్టు…. టీ20ల కోసం ఓ స్పెషల్ జట్టు… Mఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేరువేరు టీమ్స్ ఉన్న మూడు ఫార్మాట్లలో ఆడగలిగే ప్లేయర్లు మూడింటిలోనూ ఉంటారు. కోచ్ వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ టీమ్స్ ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. ఐపీఎల్ కారణంగా రిజర్వు బెంచ్ బలం బాగా పెరిగింది. కాబట్టి టీ20aలకు టీం సెలక్షన్….సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ హజారే ట్రోఫీల ద్వారా వన్డే టీమ్ లకు జట్లు…. రంజిల ద్వారా టెస్ట్ టీంలకు ఆటగాళ్ల నువ్వు తీసుకురావాలనే ప్రతిపాదనను గంభీర్ విడిచాడు. Gautam Gambhir
Also Read: Sweet Corn: రుచిగా ఉందని స్వీట్ కార్న్ తింటున్నారా..అయితే డేంజర్ లో పడ్డట్టే?
అంతేకాదు జట్టులో ఇప్పుడు ఉన్న సీనియర్ ఆటగాళ్లకు 32 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసు ఉంది. కాబట్టి మరో మూడు, నాలుగు ఏళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం వారికి లేనందున వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా గంభీర్ ప్రతిపాదనలను కోచ్ సెలక్షన్ కమిటీ కూడా అంగీకరించినట్లు బీసీసీఐ కూడా దీనికి సానుకూలంగా ఉందని ఆకాష్ చోప్రా తెలిపారు. Gautam Gambhir
అందువల్ల గంభీర్ హెడ్ కోచ్ గా వస్తే 30 ఏళ్లు దాటిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ల ఫ్యూచర్ ఏంటనేది డిసైడ్ అయిపోతుంది. వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని టీం సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఫిట్నెస్ లేకపోయినా…. ఆటగాడిగా తరచూ విఫలమవుతున్నా….మునుపటి లాగా బ్రాండ్ నేమ్ తో కొనసాగే పరిస్థితులను గంభీర్ కల్పించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక గౌతమ్ గంభీర్ టీమిండియాను విశ్వవిజేతగా నిలబడతాడేమో లేదా అనేది చూడాలి. Gautam Gambhir