Game Changer: Delayed Release for RC16

Game Changer: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా డిసెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాత నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆ మధ్య విడుదల అయింది. ఇప్పుడు దాకా ఈ సినిమా నుంచి ఒకే పాట విడుదలయ్యి ప్రేక్షకులను సినిమాపైట్ల మరింత ఆసక్తి కలిగేలా చేసింది. అంతేకాదు ఈ చిత్రం అవుట్ పుట్ పట్ల కూడా అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారట.

Game Changer: Delayed Release for RC16

తాజాగా ఈ సినిమా విడుదల డిసెంబర్లో ఉండబోదు అనే వార్తలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినపడ్డాయి. శంకర్ ఈ సినిమా చిత్రీకరణ పట్ల చూపించిన నిర్లక్ష్యమే డిసెంబర్లో ఈ సినిమా విడుదల కాకపోవడం జరుగుతుంది అని అందరూ అన్నారు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమా తప్పకుండా డిసెంబర్లో విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట. అందుకే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఇటీవలే మొదలుపెట్టారట.

Also Read: Vijay deverakonda: విజయ్ దేవరకొండ లో ఇంత మార్పు కి కారణం ఏంటి?

దీనికి సంబంధించిన ఓ పోస్టర్ కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇంకా ఒక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో దీనికి ప్యార్లర్ గా డబ్బింగ్ పనులు దిల్ రాజు మొదలుపెట్టారు. సినిమా విడుదలకు ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉండడంతో చకచక సినిమా పనులు అన్నిటిని ముగించి ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయాలని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి శంకర్ ఏ విధంగా సహకరిస్తారో చూడాలి.

వాస్తవానికి ఈ సినిమా పోయిన ఏడాది విడుదల కావలసి ఉంది. కానీ శంకర్ గత సినిమా భారతీయుడు 2 వివాదాలతో ఆగిపోవడం దాన్ని వెంటనే పూర్తిచేసి విడుదల చేయడం వంటి పరిస్థితి రావడంతో ఆయన ఆ చిత్రం చేయడానికి వెళ్లిపోయాడు. ఇటీవల ఆ సినిమా విడుదలయ్యి భారీ డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాను విడుదల చేయాలని శంకర్ పనులు మొదలు పెట్టగా అవి డిసెంబర్ కల్లా పూర్తవుతాయా అనేది చూడాలి. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.