IPL 2025: ఐపీఎల్ లో కెప్టెన్ గా రోహిత్ కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ కేప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ముంబై ఇండియన్స్ ను ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టారు. కలర్ఫుల్ లీగ్ లో 6వేలకు పైగా పరుగులు సాధించాడు. పైగా ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ గా టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ వేలంలో రోహిత్ కు భారీ ధర పలకడం కాయం. హిట్ మ్యాన్ ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఎంతైనా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ వేలంలో రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని చర్చ జరుగుతోంది. నిజానికి గత సీజన్ కు ముందు హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి ముంబై ఇండియన్స్ తప్పించింది. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని రోహిత్ ను సైడ్ చేశామని చెప్పింది. IPL 2025
Good bye to Mumbai 100 crore offer to Rohit
ముంబై ఇండియన్స్ పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీనిని అభిమానులు చేపించుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఆడేసుకున్నారు. ముంబై ఇండియన్స్ ను వదిలేయాలంటూ అప్పుడే రోహిత్ శర్మ అభిమానులు డిమాండ్ చేశారు. అయితే ఈసారి ముంబై ఇండియన్స్ ను మాజీ కెప్టెన్ వదిలేయడం ఖాయమని కథనాలు వస్తున్నాయి. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినా ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఐపీఎల్ వేలంలో ఎప్పుడూ చూడని రికార్డ్ ధరను హిట్ మ్యాన్ అందుకుంటాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు కోల్కత్తా నైట్ రైడర్స్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ వరకు చాలా జట్లు పోటీలో ఉంటాయనే వాధన ఉంది. IPL 2025
Also Read: Hardik Pandya: బరితెగించిన నటాషా.. అతనితో రెండో పెళ్ళికి రెడీ?
అయితే రోహిత్ శర్మ వేలానికి వస్తాడా లేదంటే ఏదైనా ఫ్రాంచైజీ ట్రేడింగ్ లో తీసుకుంటుందా అనే వాదన కూడా ఆసక్తికరంగా మారింది. కొందరు అభిమానులైతే ఆర్సిబిలోకి రావాలని కూడా కోరుకుంటున్నారు. సిఎస్కే అభిమానులు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అధికారికంగా క్లారిటీ లేకపోయినా రకరకాలుగా చర్చలు ఊపందుకుంటున్నాయి. వేలానికి ఇంకా చాలా సమయమే ఉన్నా…. సోషల్ మీడియాలో విభిన్న వాదనలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా లక్నో సూపర్ జేయింట్స్ రోహిత్ శర్మపై ఫోకస్ చేసే అవకాశం ఉందని…. ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గతేడాది కెప్టెన్ రాహుల్ తో ఎల్ఎస్జీ ఓనర్ వ్యవహరించిన తీరు దుమారం రేపింది. గ్రౌండ్ లోనే రాహుల్ పై నోరు పారేసుకున్నారని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. IPL 2025
ఇక ఆర్సిబికి రాహుల్ వెళ్లే అవకాశం ఉందనే కథనాలు వస్తున్నాయి. రాహుల్ ప్లేస్ లో ఎల్ఎస్జీని రోహిత్ లీడ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఓపెనర్ గా, బ్యాటర్ గా హిట్ మ్యాన్ అడ్వాంటేజ్ అవుతాడని ఎల్ఎస్జీ నమ్ముతుందనే టాక్ నడుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కు పంత్ బై చెప్పే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ లో చేరడం ఖాయమని అవకాశాలు వినిపిస్తున్నాయనే వాదన వస్తోంది. దీంతో రోహిత్ ను కెప్టెన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ కూడా హిట్ మ్యాన్ పై కన్నేసినట్లుగా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ధావన్, శ్యామ్ కరణ్ కు బదులుగా రోహిత్ ను తీసుకుంటే పంజాబ్ రాత మారుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. IPL 2025