Maps: గూగుల్ మ్యాప్స్ ని చాలామంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. నిజానికి గూగుల్ మ్యాప్స్ ని గుడ్డుగా నమ్మొచ్చా..? ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటన చూస్తుంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి కలుగుతోంది. గూగుల్ మ్యాప్స్ తో ప్రమాదాలకి గురైన సంఘటనలు ఇటీవల చాలా చూసాము. తాజాగా కేరళలో జరిగిన ఒక సంఘటన చూస్తే గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగించాలంటేనే భయం వేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.. అన్ని సందర్భాల్లోనూ గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా నమ్మకూడదు. తాజాగా కేరళలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.
Google Maps are risk
కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రికి వెళుతూ నదిలోకి వెళ్లిపోయారు. దీంతో నదిలో చిక్కుకున్న వారిని అధికారులు కష్టపడి రక్షించారు. కేరళలో నలుగురు పర్యాటకులు కారులో వెళ్తున్నారు. మ్యాప్స్ ని గుడ్డిగా నమ్మి నదిలో చిక్కుకున్నారు. స్థానికులు పోలీసులు పర్యటకుల్ని రక్షించారు. గూగుల్ మ్యాప్స్ కారణంగా ప్రమాదాల్లో ఇరుక్కున్న సంఘటనలు చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా నమ్మొద్దు అని చర్చ తెర మీదకు వస్తోంది ఇదే సమయంలో తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తుంటే ముందుగా అక్కడ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ తో పాటుగా ఆసుపత్రి నెంబర్ ని దగ్గర పెట్టుకోవాలి.
Also read: Manchu Lakshmi: ప్లీజ్ అర్జెంట్.. ఎవరైనా సహాయం చేయండి.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్..!
ప్రతి సందర్భంలో మ్యాప్స్ పైన ఆధారపడకూడదని స్థానికులు చెప్తున్నారు. అడ్రెస్ తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలి. మ్యాప్స్ లో చూపిస్తున్న సమాచారాన్ని చెక్ చేసుకోవాలి జర్నీ స్టార్ట్ చేయగానే ముందుగా రూట్ ని పూర్తిగా గమనించండి. రోడ్డు ఒకవేళ దట్టమైన చెట్లు లేదా తార్ రోడ్డు కాకుండా మట్టి రోడ్డు పైకి చూపిస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్డేట్ గా ఉంచుకోండి. కొత్తగా ఏవైనా మార్పులు జరిగితే తెలుసుకోవడానికి వీలుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా గూగుల్ కంటే స్థానికంగా ఉన్న ప్రజలకే స్పష్టమైన రూట్ తెలుస్తుందని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇలా మీరు చేస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏకంగా చాలామంది గూగుల్ మ్యాప్స్ వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. తాజాగా జరిగిన సంఘటన కూడా అందుకు ఉదాహరణ (Maps).