Gopichand: జయం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు హీరో నితిన్. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యువతరం మెచ్చిన ఈ హిట్ సినిమా సదా హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ద్వారా నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు పరిచయమయ్యారు.. అప్పట్లో జయం సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. నేటికీ ఎవర్గ్రీన్గా ఉన్న ఈ సినిమా కు ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూర్చారు. ఇక హీరో గోపీచంద్ విలన్ రోల్ పోషించగా నితిన్, సదా లకు మించి గోపీచంద్ నటనకు ప్రశంసలు దక్కాయి ప్రేక్షకుల నుంచి.
Gopichand Movie Jayam Child Artist
రెండవ సినిమా లోనే గోపీచంద్ విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.. అయితే గోపీచంద్ పోషించిన పాత్ర చిన్నప్పటి పాత్ర అందరికి గుర్తుంది కదా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ను పోషించిన ఆ అబ్బాయి పేరు దిలీప్ కుమార్ సల్వాది. ఈ సినిమా గోపీచంద్ కు ఎంతటి మంచి పేరైతే తీసుకోచ్చిందో దిలీప్ కి కూడా అంతే మంచి పేరును తీసుకొచ్చింది. కృష్ణ హీరో గా నటించిన నెంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిలీప్ దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. పుణ్యభూమి నా దేశం, మౌనం, ధర్మచక్ర, స్నేహం కోసం, ఓ అమ్మాయి, అన్నయ, మా అన్నయ, దాడి, జయం, భాగమతి తదితర చిత్రాల్లో నటించారు.
Also Read: Amla: ఉసిరికాయ రోజుకు ఒకటి తింటే 100 రోగాలకు చెక్..రాత్రి మగాళ్లు కూడా రెచ్చిపోతారు ?
2005 తర్వాత, అతను చాలా సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించాడు. 2019లో దిక్సూచి సినిమాతో హీరోగా మారాడు. దొంగల బండి, అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్లో నటించి ఆకట్టుకున్నాడు. కానీ దిలీప్ కుమార్ కి హీరోగా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.మరి భవిష్యత్ లో ఈ హీరో కి మంచి హిట్స్ వచ్చి హీరో గా టాలీవుడ్ లో నిలదొక్కుకుంటాదో చూడాలి.