Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వివిధ ఆర్థిక అవకాశాలను కల్పిస్తూ నిజంగా ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాల్లో (SHG) సభ్యులుగా ఉన్న మహిళలకు ఎన్నో రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇటీవల ఈ ప్రయోజనాలకెక్కించి, “ఇందిరా మహిళా శక్తి పథకం” ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనను మరింతగా బలోపేతం చేసేలా ప్రభుత్వం మరొక అద్భుత అవకాశం అందించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి, ఆదాయం పెంచుకోవడానికి వీలుగా రుణ సౌకర్యాలు పొందేలా సకల ఏర్పాట్లు కల్పించింది.
Government Grants and Loans for Women Farmers in Telangana
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు SERP సంస్థ ద్వారా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలతో ట్రాక్టర్లు, గడ్డి కోత యంత్రాలు, కలుపు తీత యంత్రాలు వంటి ఖరీదైన వ్యవసాయ పరికరాలను సొంతం చేసుకోవచ్చు. వీటిని గ్రామీణ రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా మహిళలు ఒక స్థిర ఆదాయాన్ని పొందగలుగుతారు. అద్దె ద్వారా వచ్చే ఈ ఆదాయంతో రుణాలను సులభంగా తిరిగి చెల్లించవచ్చు. ఇలా మహిళలు రుణభారాన్ని తగ్గించుకుంటూనే కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడతారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలు లభించడం మాత్రమే కాకుండా, వారు స్వతంత్రంగా ఆదాయం ఆర్జించడానికి మార్గం సుగమమవుతోంది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. న్యూజిల్యాండ్ సిరీస్ ఓటమి తో కీలక నిర్ణయం!!
ఈ పథకం మహిళలకు, రైతులకు రెండు వైపులా లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయాల్సిన భారాన్ని రైతులు తప్పించుకోగలుగుతారు. తక్కువ అద్దెకు ఈ పరికరాలను తీసుకోవడం ద్వారా వ్యవసాయం చేయడంలో సౌకర్యం పొందవచ్చు. అలాగే, మహిళలు ఆర్థికంగా స్వావలంబనకు దారి తీసే అవకాశం పొందడంతో పాటు, వ్యవసాయ రంగంలో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. ఈ విధంగా మహిళలు తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో ప్రధాన పాత్ర పోషించగలుగుతారు.
ప్రస్తుతం ట్రాక్టర్లు, గడ్డి కోత యంత్రాలు, కలుపుతీత యంత్రాలు, రోటోవేటర్, మినీ ప్లవ్, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, కేజ్ వీల్ వంటి పరికరాలు ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్ల వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను కూడా అందుబాటులోకి తేనుటకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలు ఒకవైపు ఆర్థికంగా ఎదగడమే కాకుండా, మరోవైపు వ్యవసాయ రంగంలో కీలక పాత్రను పోషించే అవకాశాన్ని పొందుతున్నారు.