Amala Paul: మలయాళ బ్యూటీ అమలాపాల్..ఈ మధ్యనే పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆమె మొదట్లో విజయ్ అనే దర్శకున్ని పెళ్లాడినప్పటికీ ఆయనతో ఎక్కువ రోజులు ఉండలేక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్పి ఈ మధ్యనే పండంటి బాబుకు కూడా జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది హెయిర్ స్టైలిస్ట్ హేమ..
Hair stylist hema sesational comments on Amala Paul
అమలా పాల్ నిజస్వరూపం అదే అంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం సృష్టించాయి.మరి ఇంతకీ హేమ అమలా పాల్ గురించి ఏం చెప్పిందంటే.. మేము ఓ రోజు సినిమా షూటింగ్ సమయంలో ఉన్నాం.అయితే ఆ టైంలో షూటింగ్ స్పాట్లో ఒక్క చెట్టు కూడా లేదు.అలాగే విపరీతమైన ఎండ ఉంది. ఇక అక్కడే అమలాపాల్ వ్యానిటీ వ్యాన్ ఉంది. (Amala Paul)
Also Read: Prabhas: డార్లింగ్ ఖాతాలో మరో రికార్డు.. ఆ విషయంలో ప్రభాస్ ని ఢీ కొట్టే హీరోనే లేడు..!
ఆ వ్యాన్లో ఓవైపు అమలాపాల్ కి మరోవైపు అక్కడే ఉన్న ఆర్టిస్టులు ఉండేలా సదుపాయం ఉంది.అయితే ఎండ భరించలేక మేము ఆర్టిస్టులు కూర్చునే వైపు వెళ్లి కూర్చున్నాం. అయితే ఇదంతా గమనించిన అమలాపాల్ తన మేనేజర్ ని పిలిపించుకొని వెంటనే వాళ్ళు వ్యానిటీ వ్యాన్ నుండి బయటికి రావాలి అంటూ మేనేజర్ కి చెప్పించి మమ్మల్ని అందరినీ బయటికి గెంటించింది. కానీ బయట ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో ఏం చేయాలో మాకు తెలియలేదు.
అమలాపాల్ చేసిన పనికి ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఇక మేము ఇప్పటివరకు పనిచేసిన హీరోయిన్స్ లో టబూ చాలా మంచిది.ఆమె హెయిర్ స్టైలిస్ట్ ల కోసం స్పెషల్గా ఒక వ్యానిటీ వ్యాన్ బుక్ చేసారు..అంటూ టబూని మెచ్చుకుంటూ అమలాపాల్ నిజస్వరూపం బయట పెట్టింది హెయిర్ స్టైలిస్ట్ హేమ.ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలా మందిని నెటిజన్స్ అమలాపాల్ అంత దారుణంగా ప్రవర్తించిందా..వాళ్ళు ఎక్కితే ఆమె వ్యానిటీ వ్యాన్ ఏమైనా అరిగిపోతుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Amala Paul)