Hardik Pandya: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోనున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా వినిపిస్తున్న పుకార్లను ధృవీకరిస్తూ సోషల్ మీడియా ద్వారా తమ నాలుగేళ్ల వివాహానికి వీడ్కోలు పలికారు. అయితే విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు ఎంత భరణం ఇస్తాడనే చర్చ మొదలైంది. విడాకులు తీసుకుంటే హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% భార్యకు అప్పగించాల్సి ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని నటాషాకు పాండ్యా నుంచి భారీ మెయింటెనెన్స్ లభించదని అంటున్నారు. దీనికి సంబంధించి హార్దిక్ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Hardik Pandya natasa divorce news
2018లో గౌరవ్ కపూర్ యొక్క ‘బ్రేక్‌ఫాస్ట్ ఆఫ్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, “నా ఆస్తులన్నీ మా అమ్మ పేరు మీద రిజిస్టర్ చేయబడ్డాయి. నా పేరు మీద ఏమీ లేదు. కారు నుండి ప్రతిదీ మా అమ్మ పేరు మీద ఉంది. నేను ఎవరిని నమ్మను.. అందుకే నా ఆస్తిని భవిష్యత్తులో ఎవరికీ ఇవ్వకూడదనే అమ్మ పేరు మీద ఆస్తులన్నీ ఉంచాను. భవిష్యత్ లో నేను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే నా ఆస్తిలో 50% ఎవరికైనా ఇవ్వాలి.. అందుకే అన్నింటినీ మా అమ్మ పేరు మీద కొన్నాను. అని బహిరంగంగా ఈ విషయాన్నీ చెప్పాడు.
Also Read: Amla: ఉసిరికాయ రోజుకు ఒకటి తింటే 100 రోగాలకు చెక్..రాత్రి మగాళ్లు కూడా రెచ్చిపోతారు ?
ఇప్పుడు హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకోనున్నాడు. అయితే విడాకుల విషయంలో నటాషా పాండ్యా ఆస్తిలో 50% భరణంగా పొందగలదా అనేది అనుమానమే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చెప్పినట్లుగా, ఆస్తులన్నీ అమ్మ పేరు మీద ఉన్నాయి. కాబట్టి నటాషా కొద్దిపాటి మెయింటెనెన్స్‌ను మాత్రమే పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా టీం ఇండియా లో మంచి అల్ రౌండర్ గా, కెప్టెన్ గా ఎదుగుతున్న హార్దిక్ పాండ్య కి ఇది పెద్ద మైనస్ అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం జరగబోయే శ్రీలంక సిరీస్ కు టీం ఇండియా సన్నద్దమవుతుంది.