Hardik Pandya: ప్రముఖ బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటాషా సెర్బియా దేశస్తురాలు. 1992 మార్చి 4వ తేదీన జన్మించింది. మొదట మోడల్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించింది. సినిమాల్లో చేస్తున్న సమయంలోనే ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. Hardik Pandya
Hardik Pandya Natasha who is divorced is she ready for a second marriage
ఇక వీరు వివాహానికి ముందే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక గత సంవత్సరం వీరు హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వారి వివాహాన్ని చేసుకున్నారు. కనీసం వివాహం చేసుకొని ఏడాది గడవకముందే విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే హార్దిక్ పాండ్యా నటాషా విడాకులు తీసుకుంటున్నట్లు ఎప్పటినుంచో రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. Hardik Pandya
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్..?
రీసెంట్ గా వీరు విడాకులు తీసుకున్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు. విడాకులు తీసుకున్నప్పటికీ మా మూడేళ్ల కుమారుడు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కలిసి స్వీకరిస్తామని వెల్లడించారు. ఇక విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్ళిపోయింది. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. Hardik Pandya
ఈ క్రమంలోనే నటాషాపై తన కుటుంబ సభ్యులు మరో వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారట. అంతేకాకుండా ఇప్పటినుంచే అబ్బాయిని వెతికే పనిలో పడ్డారట. ఇక విడాకులు తీసుకున్న ఇంత తక్కువ సమయంలోనే నటాషా వివాహం చేసుకుంటుందా….. లేకపోతే తన కుమారుడు కోసం సింగిల్ గానే ఉంటుందా అనేది చూడాలి. Hardik Pandya