Hardik Pandya: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక హార్దిక్ వ్యక్తిగత విషయానికి వస్తే….సెర్బియా నటి నటాషాను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అగస్త్య అనే మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇక వీరు గత సంవత్సరంలో హిందూ, క్రిస్టియన్స్ సాంప్రదాయ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించుకున్నారు. Hardik Pandya
Hardik Pandya Relation with a heroine who is 4 years older than him
వివాహమై సంవత్సరం గడవకముందే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ఎన్నో రోజుల నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే గత నెలలో వీరి విడాకుల విషయాన్ని వారి సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు. ఇది వారికి చాలా కఠినమైన నిర్ణయం అని….. ఎంతో ఆలోచించిన తర్వాత ఈ విడాకుల నిర్ణయాన్ని తీసుకున్నామని…. మేము విడిపోయినప్పటికీ మా కుమారుడికి తల్లిదండ్రులుగా ఎప్పటికీ ఉంటామని పేర్కొన్నారు. Hardik Pandya
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు రూ. 50 కోట్లు దండగ….?
ఇక నటాషా తన కుమారుడిని తీసుకుని సెర్బియాకు వెళ్ళిపోయింది. విడాకుల అనంతరం హార్దిక్ వేరే అమ్మాయిలతో రిలేషన్ కొనసాగిస్తున్నట్టు ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హార్దిక్ పాండ్యా వెనుక చాలామంది అమ్మాయిలే పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఇషిత రాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తనకు హార్దిక్ పాండ్యా అంటే విపరీతమైన ఇష్టమని తెలిపింది. పాండ్యా ఒక అద్భుతమైన క్రికెటర్ ఆల్ రౌండర్. Hardik Pandya
అతని బ్యాటింగ్ నాకు చాలా ఇష్టం. నేను హార్దిక్ ను ప్రేమిస్తున్నాను. నా అభిమాన క్రికెటర్లలో హార్దిక్ ఒకరని చెప్పుకొచ్చింది. హార్దిక్ పాండ్యాపై తన ప్రేమను చాటుకున్న ఇషిత అతనికన్నా నాలుగు సంవత్సరాలు పెద్దది. పాండ్యా వయసు 30 సంవత్సరాలు కాగా…. ఇషిత వయసు 34 సంవత్సరాలు. ఆమె ఢిల్లీ వాసి. గార్గి కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె ఇంగ్లాండ్ లో బిజినెస్ స్టడీస్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఇషిత రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. Hardik Pandya