Devara: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దేవర సినిమాకు సంబంధించి షోలు పడిపోయాయి. అయితే సినిమా చూసిన జనాలు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సినిమాపై రాజమౌళి సెంటిమెంట్, ఆచార్య ఎఫెక్ట్ బాగానే పడింది అంటూ రివ్యూలు ఇస్తున్నారు.. అయితే సినిమా ఎలా ఉంది..ఎందుకు అలాంటి రివ్యూలు ఇస్తున్నారు అనేది చూస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఏ హీరో అయినా సరే నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవ్వాల్సిందే.
Has Rajamouli sentimental Acharya effect ruined Devara
ఎందుకంటే రాజమౌళి సినిమాలో భారీ అంచనాలతో హీరోని చూసి మళ్లీ వేరే సినిమాల్లో ఆ హీరోని చూస్తే అభిమానులు యాక్సెప్ట్ చేయలేరు.దాంతో రాజమౌళి సినిమా చేశాక వేరే సినిమాల్లో చేస్తే ఆ హీరోల మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి.అయితే ఇది గత కొద్దిరోజులుగా జరుగుతూ వస్తుంది.ఇక తాజాగా ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. (Devara)
Also Read: Janhvi Kapoor: జాన్వీ కెరీర్ మలుపు తిప్పే సినిమా.. ‘దేవర’ అయితే కాదమ్మా!!
ఇక ఈ సినిమాపై ఆచార్య ఎఫెక్ట్ కూడా బాగానే పడిందని కొంతమంది భావిస్తున్నారు. అయితే సినిమా చూసిన అభిమానులు స్క్రీన్ ప్లే తోపాటు కొరటాల మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదని ఒకప్పుడు కొరటాల సినిమాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అని కొరటాలను తిట్టిపోస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులైతే కొరటాల శివ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
అయితే ఏదైనా ఫ్లాప్ సినిమా తీస్తే దాని ఎఫెక్ట్ మరో సినిమాపై పడుతుంది.ఆ సినిమా బాగున్నా కూడా ఫ్లాప్ టాకే వస్తుంది. అలా దేవర సినిమాలో కూడా అదే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ కూడా కథను సరిగ్గా ఎంచుకోలేదు అని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు.(Devara)