Moong dal: నేటి కాలంలో చాలామంది వివిధ రకాల ఆహార పదార్థాలను చేసుకొని తింటున్నారు. మరి ముఖ్యంగా నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. ఇక మనం తీసుకునే రోజు వారి ఆహారంలో పెసరపప్పును తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరీ ముఖ్యంగా పెసరపప్పులో ఫైబర్, ఖనిజాలు ఉండడం వల్ల మన శరీరంలో ఏర్పడే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. Moong dal
Health Benfits With Moong dal
రెండు రోజులకు ఒక్కసారైనా పెసరపప్పును తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నం చేసేవారు పెసరపప్పును తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఎందుకంటే పెసరపప్పు తినడం వల్ల కడుపు ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఆకలి అస్సలు ఉండదు. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు. పెసరపప్పులో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం ఆల్సర్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు నియంత్రించడానికి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. పెసరపప్పులో క్యాన్సర్ ను ఎదుర్కొనే గుణాలు పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. Moong dal
Also Read: Roja: ఛీ..ఛీ ఇదేం పాడుపని రోజా..రంగంలోకి జగన్ ?
దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వును నియంతించడంతోపాటు గుండె జబ్బులను నియంత్రిస్తుంది. శరీరంలో ఏర్పడే వివిధ రకాల ఇన్ఫెక్షన్లను సులభంగా తగ్గిస్తుంది. పెసరపప్పు వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. మరి ముఖ్యంగా కాలుష్యం వల్ల వివిధ రకాల సమస్యలు ఏర్పడతాయి. అలాంటి సమస్యల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. Moong dal
పెసరపప్పు ప్రేగులలో ఏర్పడే బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. ఇక పెసరపప్పు తినడం వల్ల ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు పెసరపప్పును తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో విటమిన్స్ ఉండడం వల్ల చర్మానికి ముడతలు పడకుండా సహాయం చేస్తుంది. మరి ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు పెసరపప్పును తప్పకుండా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Moong dal