Aamani: సీనియర్ నటి ఆమని కి నిజంగానే ఆరుసార్లు అబార్షన్ జరిగిందా.. ఎందుకు ఆమె అన్ని సార్లు అబార్షన్ చేసుకుంది.. సినిమాల కోసమా..లేక పిల్లల్ని కనడం ఇష్టం లేకనా.. అని ఈ విషయం తెలిసిన చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. మరి ఆరుసార్లు ఆమని అబార్షన్ చేయించుకోవడానికి అసలు కారణం ఏంటో తెలిస్త బాధపడడం మీ వంతు అవుతుంది.ఎందుకంటే ఈ హీరోయిన్ పిల్లల్ని కనడం ఇష్టం లేకనో లేక సినిమాల మీద ఇష్టంతో సినిమాల్లో గ్యాప్ వస్తుంది అనే ఉద్దేశంతోనో అబార్షన్ చేయించుకోలేదు.
Heroine Aamani who underwent six abortions.. what happened
నాచురల్ గానే జరిగిందట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమని చెబుతూ.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం.పిల్లల కోసం మా ఆయన నేను ఎంతో ట్రై చేశాం.కానీ నాకు ఆరు సార్లు అబార్షన్ జరిగింది. అయితే ఇన్నిసార్లు ఎందుకు అబార్షన్ జరుగుతుందో తెలియక డాక్టర్ల కూడా జుట్టు పీక్కున్నారు.ఓ డాక్టర్ అయితే నీ దగ్గర ఉన్న సమస్య ఏంటో తెలియడం లేదు.(Aamani)
Also Read: Vishwak Sen: పాపం.. వాళ్ళ దెబ్బకి ఇన్స్టాగ్రామ్ అకౌంటే డిలీట్ చేసిన విశ్వక్ సేన్.!
ఈ విషయంలో నేను డాక్టర్ అయి ఉండి కూడా ఏమి తెలుసుకోలేక పోతున్నాను.నేను ఓడిపోయాను అంటూ మాట్లాడింది. ఇక ఇలా అబార్షన్స్ అవ్వడంతో ఎంతోమంది పెద్ద పెద్ద స్పెషలిస్టులను కలిసాము.కానీ ఓ డాక్టర్ మాత్రం నా ప్రాబ్లం గుర్తించింది. నేను సినిమాల వల్ల డైట్ ఎక్కువగా చేయడంతో బ్లడ్ డెఫిషియన్సీ వచ్చి ప్రోటీన్ ఎస్ తక్కువైందని చెప్పింది.
అయితే ఈ కారణంతోనే నాకు ప్రతిసారి అబార్షన్ జరిగిందని ఆ డాక్టర్ గుర్తించారు. ఇక నాకున్న ప్రాబ్లం తెలియడంతో ట్రీట్మెంట్ తీసుకున్నాను. అలా ఆరుసార్లు అబార్షన్ అయ్యాక ఏడోసారి నా ప్రెగ్నెన్సీ నిలబడింది. ఇక పిల్లల కోసం నేను ఎంతో మంది దేవుళ్లను మొక్కుకున్నాను. అలా చివరికి దేవుడు ఆ డాక్టర్ రూపంలో వచ్చాడని ఎంతగానో మురిసిపోయాను అంటూ ఆమని చెప్పుకొచ్చింది.(Aamani)