Heroine Bhumika divorce all because of that hero

Bhumika: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తారల్లో భూమిక కూడా ఒకరు. అలాంటి భూమిక తెలుగు ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోలతో నటించింది. సింహాద్రి,వాసు, ఒక్కడు, సత్యభామ, ఖుషి వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2000 సంవత్సరంలో యువకుడు అనే చిత్రం ద్వారా భూమిక తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఆమె మొదటి చిత్రాన్ని నాగార్జున ప్రొడ్యూస్ చేశారట.

Heroine Bhumika divorce all because of that hero

ఈ సినిమాలో ఏఎన్ఆర్ పెద్ద మనవడు అయినటువంటి సుమంత్ హీరోగా చేశాడు. అప్పట్లో ఈ చిత్రం థియేటర్లలో బాగానే కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ మూవీ తర్వాత నాగార్జునతో స్నేహమంటే ఇదేరా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే భూమికతో నాగార్జునకు మంచి స్నేహం ఏర్పడిందట. అలా వీరు వారి స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి ఆ తర్వాత హిందీ,మలయాళం, పంజాబీ,భోజ్ పురి, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా చాలా చిత్రాల్లో చేసింది.( Bhumika)

Also Read: Sruthi Haasan: శృతిహాసన్ న్యూ** ఫోటోస్ వైరల్.?

అలా కెరియర్ బిజీగా ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను 2007 అక్టోబర్ 21న వివాహం చేసుకుంది. ఇక వారి లైఫ్ హ్యాపీగా సాగుతున్న సమయంలోనే ఇండస్ట్రీలో వారు విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త గుప్పుమంది. దీంతో వారు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని నాగార్జున అనుకున్నారట. వారి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అవి సెట్ చేసి వారిని కలపాలని ఆయన భావించారట. అలా అనుకున్న వెంటనే ఆయన భూమిక ఇంటికి వెళ్లి భరత్ తో పాటు భూమిక తో కూడా మాట్లాడారట.

 Heroine Bhumika divorce all because of that hero

ఏంటి మీకేమైంది విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగారట. దీంతో ఆశ్చర్యపోయినటువంటి భూమిక దంపతులు.. కాసేపు నవ్వుకొని మేము విడాకులు తీసుకోవడమేంటి అవన్నీ రూమర్స్ అని చెప్పారట. అన్ని వార్తలు వస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదని నాగార్జున అడిగితే, మేము వాటిపై స్పందిస్తే ఆ రూమర్స్ ఎక్కువ అవుతాయి. సైలెంట్ గా ఉంటే వాటంతట అవే సర్దూమణిగిపోతాయని చెప్పి నవ్వారట. దీంతో వారి మాటలు విన్న నాగార్జున షాక్ అయిపోయారట. అప్పటినుంచి ఆయన కూడా ఇలాంటి రూమర్స్ వార్తలు వచ్చినా అందులో నిజం లేదని కొట్టిపారేస్తూ స్పందించడం మానేశారట.( Bhumika)