Heroine: సినిమా పరిశ్రమలో టెక్నీషియన్స్ మధ్య నటీనటుల మధ్య విభేదాలు రావడం సహజం.అలా వారు కొంతమందిని ఎంతో అవమానిస్తూ ఉంటారు. ఇంకొంతమందిని విమర్శిస్తూ ఉంటారు. అవమానాలకు కూడా గురి చేస్తూ ఉంటారు. ఆ విధంగా తమ తోటి వారి నుంచే ఈ విధమైన విమర్శలు రావడం.. ఏ నటలకైనా టెక్నీషియన్ కైనా ఇబ్బందికరమని చెప్పాలి. ప్రారంభంలో నటులు టెక్నీషియన్లు ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది. వారి లుక్స్ కారణంగా టాలెంట్ కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విధంగా స్టార్ నటి తన కెరియర్లో ఎన్నో అవ మానాలు ఎదుర్కొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హీరోయిన్ గా ఎదిగి తనను విమర్శించిన వారికి సమాధానం చెబుతుంది.
Heroine Priyanka Chopra Career Begining Incidents
కెరీర్ మొదట్లో చాలామంది నటీనటులు సినిమా పరిశ్రమకు సరిపోరని కొంతమంది చెబుతూ ఉంటారు. బాడీ షేవింగ్ చేస్తూ ఉంటారు.. వారిలో టాలెంట్ ఉన్నా కూడా తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అలాంటి సవాళ్ళను అధిగమించి విజయాన్ని అందుకొని ప్రతి ఒక్కరి నోరు మూయించింది హీరోయిన్ ప్రియాంక చోప్రా.బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే హాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ గా నిలిచిపోయింది.ఏదేమైనా ఆమె సినీ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదని చెప్పాలి. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరు కూడా అవమానించిన వారే.
Also Read: Shree Rapaka: ఒంటిమీద బట్టలు లేకపోతే ఆ డైరెక్టర్ నన్ను వదిలేవాడు కాదు.!
ఓ దర్శకుడు అయితే ఏ స్థాయిలో అవమానించాడంటే అప్పట్లో ఆమె చాలా బాధపడిందట. ఓ సినిమా కోసం ప్రియాంక చోప్రా సదరు దర్శకుడిని సంప్రదించగా ఈ పాత్రకు నువ్వు పనికిరాని, నీ కలర్ టోన్ బాగోలేదని అన్నాడట. అసలు సినిమాలకే పనికిరావన్నారట. అయితే దాన్ని పట్టించుకోకుండా కష్టపడి సినిమాలు చేసి ఇంతటి స్థాయికి ఎదిగింది ప్రియాంక చోప్రా. ఆమె అంకితభావం, కృషి ఇప్పుడు ఆమె ఇంతటి స్థాయికి తీసుకువచ్చాయని చెప్పాలి. నిజంగా ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. చిత్ర పరిశ్రమలో విజయం సాధించడానికి ప్రియాంక లాగా ధైర్యం ఉంటే చాలు అని చాలామంది చెప్పుకుంటున్నారు.