Rajeev Gandhi: ఇండియాలో గాంధీ కుటుంబం అంటే ఎంతటి పేరు ఉందో మనందరికీ తెలుసు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి వచ్చింది. అలాంటి గాంధీ కుటుంబం రాజకీయాల్లో ఎలాంటి స్థాయిలో ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పటి నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలా అందరూ కాంగ్రెస్ పార్టీని అంచలంచలుగా ఎదిగేలా చేస్తూ దేశానికి పలుమార్లు ప్రధానులుగా సేవలు అందించారు.
Heroine who will marry Rajeev Gandhi while Sonia Gandhi is still there
అలాంటి గాంధీ కుటుంబంలో దేశానికి సేవలు అందించిన వారిలో రాజీవ్ గాంధీ కూడా ఒకరు. ఇందిరా గాంధీ వారసుడిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఆమె హత్యకు గురైన తర్వాత ప్రధాని భాద్యతలు కూడా తీసుకున్నారు. అంతటి స్థాయిలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీని ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటానని విపరీతంగా ఇంట్లో గొడవ చేసిందట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అప్పట్లో రాజీవ్ గాంధీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు. (Rajeev Gandhi)
Also Read: Rukmini Vasanth: ఎన్టీఆర్ మూవీలో చేయబోతున్న రుక్మిణి వసంత్ కి ఇంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉందా..?
తల్లి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఆయనకు రాజకీయాల్లోనే కాకుండా బయట అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేదట. చూడటానికి ఎంతో హ్యాండ్సమ్ గా ఉంటారు. కాబట్టి ఎంతోమంది అమ్మాయిలు ఆయన లాంటి భర్త కావాలని కోరుకునే వారట. కానీ ఆ హీరోయిన్ మాత్రం రాజీవ్ గాంధీ తనకు భర్తగా రావాలని ఇంట్లో గొడవ చేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అందాల తార రాశి. టీనేజ్ లో ఉన్నప్పుడు పేపర్లో రాజీవ్ గాంధీ ఫోటో చూసి, ఎంత అందంగా ఉన్నాడు చేసుకుంటే ఈయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట.
అయితే అప్పటికి రాశికి ఆయన ప్రధాని అని తెలియదు. అలాగే ఆ పేపర్ ఉన్న ఫోటోను వారి తల్లిదండ్రులకు చూపిస్తూ నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటూ విపరీతంగా వాదన చేసిందట. అయితే ఇదే విషయాన్ని రాశి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఓ స్థాయికి ఎదిగిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వాస్తవానికి రాజీవ్ గాంధీని ఆమె పెళ్లి చేసుకుంటా అని చెప్పినప్పుడు ఆయన ఎవరో ఆమెకు తెలియదట. చివరికి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీకి బాస్ తెలిసి తనకు తానే నవ్వుకుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Rajeev Gandhi)