Heroines: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోకి, హీరోయిన్ కి హీరోయిన్ కి మధ్య అప్పుడప్పుడు వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా గొడవలు వస్తూ ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో చాలా కామన్.ఇప్పటికే ఇలా గొడవలు పెట్టుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతమంది గొడవలు పెట్టుకుని ఆ తర్వాత కొన్ని ఈవెంట్లలో కలిసిపోతారు.కానీ మరి కొంత మంది మాత్రం ఇండస్ట్రీలో ఎప్పటికీ బద్ధ శత్రువులు గానే ఉండిపోతూ ఉంటారు. ఇక అలాంటివారు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు.
Heroines who got into a fight during shooting
అయితే వారి గురించి ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం కానీ ఈ ఇద్దరు హీరోయిన్లు మాత్రం చెప్పుల కోసం షూటింగ్ సెట్లో గొడవ పెట్టుకున్నారట.మరి ఆ హీరోయిన్స్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చెప్పుల కోసం గొడవ పెట్టుకున్నది మామూలు హీరోయిన్లు కాదు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లే.వాళ్ళు ఎవరో కాదు జయసుధ, జయచిత్ర. ఇక విషయంలోకి వెళ్తే.. దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన కటకటాల రుద్రయ్య సినిమాలో కృష్ణంరాజు హీరోగా చేయగా జయసుధ,జయచిత్ర ఇద్దరు హీరోయిన్స్ గా చేశారు.(Heroines)
Also Read: Shriya: నాగార్జున మేనకోడలి భర్తతో రొమా* చేసిన హీరోయిన్ శ్రీయ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జయసుధకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆమెకి మంచి కాస్ట్యూమ్స్ ఇస్తున్నారనే విషయం తెలుసుకున్న జయచిత్ర రచ్చ రచ్చ చేసి నాకంటే జయసుధ ఏమాత్రం అందంగా ఉంది అని దాసరి నారాయణకు ఫిర్యాదు చేసిందట.అయినప్పటికీ జయసుధ ఇవన్నీ పట్టించుకోలేదట. ఇక వీరిద్దరికీ హై హీల్స్ దగ్గర గొడవ ఏర్పడిందట.ఎందుకంటే కృష్ణంరాజు హైట్ ఎక్కువగా ఉండడంతో ఆయన హైట్ కు మ్యాచ్ అయ్యేలా జయసుధ రెండు మూడు ఇంచుల హైట్ ఉండే హై హీల్స్ ధరించిందట.
అలా హై హీల్స్ విషయంలో వీరిద్దరికి గొడవ జరిగిందని అప్పట్లో మీడియాలో పుకార్లు వినిపించాయి. ఇక ఈ రూమర్ వినిపించడంతో ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో ఇద్దరూ కొట్టుకునే సీన్ ఉంటుంది.దాంతో మీడియాలో వీరిద్దరూ నిజంగానే కొట్టుకున్నారనే రూమర్ వినిపించిందట.. ఇక ఈ విషయంపై జయసుధ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ.. జయచిత్రకి నాతో ఆ షూటింగ్ సమయంలో చిన్న గొడవ జరిగింది నిజమే.కానీ క్లైమాక్స్ సీన్ లో ఇద్దరం నిజంగా కొట్టుకున్నాం అనేది మాత్రం అబద్ధం అంటూ జయసుధ క్లారిటీ ఇచ్చింది.(Heroines)