How Sukumar and Allu Arjun Journey Began with Arya

Sukumar and Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో సూపర్ హిట్ గ్యారెంటీ. “ఆర్య”తో ప్రారంభమైన ఈ కాంబో, “ఆర్య 2”, “పుష్ప: ది రైజ్” లతో సక్సెస్ జర్నీ కొనసాగించి, ఇప్పుడు “పుష్ప 2: ది రూల్”తో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఓ సమావేశంలో సుకుమార్, “ఆర్య” సినిమా వెనుక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

How Sukumar and Allu Arjun Journey Began with Arya

“దిల్” సినిమా షూటింగ్ సమయంలో, తన రాసుకున్న కథలోని కొన్ని సన్నివేశాలను నిర్మాత దిల్ రాజుకు చెబుతుంటే, అవి ఆయనకు బాగా నచ్చేవని సుకుమార్ గుర్తుచేసుకున్నారు. “దిల్” సినిమా హిట్ అయితే, తనకు దర్శకత్వం చేసే అవకాశం ఇస్తానని దిల్ రాజు మాట ఇచ్చారట. ఆ హిట్ తర్వాత, సుకుమార్ కు అవకాశం వచ్చినప్పటికీ, రీమేక్ చేయనని చెప్పి, తన కథను వినిపించగా, దిల్ రాజు వెంటనే ఓకే చెప్పారని సుకుమార్ వెల్లడించారు.

Also Read: Radhika Apte: పెళ్లయి 12 ఏళ్ల తర్వాత గర్భవతిగా కనిపించిన ప్రముఖ నటి రాధికా ఆప్టే!!

కథ ఫైనల్ అయిన తర్వాత, హీరో కోసం వెతకడం ప్రారంభమైంది. కొత్త హీరోతో సినిమా చేయాలనుకున్న సుకుమార్, అల్లు అర్జున్ పేరు విన్నప్పుడు స్నేహితులు నవ్వారని గుర్తుచేశారు. ఆ సమయంలో “దిల్” సినిమా ప్రివ్యూకు వచ్చిన అల్లు అర్జున్, తన ఉత్సాహంతో అందరినీ పలకరిస్తూ, కౌగిలించుకుంటూ కనిపించడంతో, సుకుమార్‌కి “ఆర్య” పాత్రకు పర్ఫెక్ట్ గానే కనబడినట్లు అనిపించిందట.

స్నేహితులు కూడా అల్లు అర్జున్ కే ఓటు వేసిన తర్వాత, మూడు నెలల ఆడిషన్ చేసి, బన్నీని “ఆర్య” కోసం ఫైనల్ చేశారని సుకుమార్ తెలిపారు. ఆ సినిమా సక్సెస్ తో ప్రారంభమైన ఈ కాంబినేషన్, తర్వాతి ప్రతి సినిమాతో సూపర్ డూపర్ హిట్లను అందించడం విశేషం.