Female Leads: పాన్ ఇండియా సినిమాల కాలంలో తెలుగు హీరోలు తమ చిత్రాల్లో బాలీవుడ్ భామలను పెట్టుకోవడం అలవారైపోయింది. బాలీవుడ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, హిందీ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఇది ఒక వ్యూహంగా ఎంపిక చేస్తున్నారు. కానీ ఈ విధానం ఎప్పుడూ విజయవంతమవుతుందని చెప్పలేము.
How Telugu Cinema Can Improve Roles for Female Leads
ఉదాహరణకు, ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్‌కు ఇచ్చిన పాత్ర ప్రాధాన్యత మరియు ‘దేవర’లో జాన్వీ కపూర్‌కు ఇచ్చిన పాత్ర ప్రాధాన్యత పరిశీలిస్తే, ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ పాత్ర కేవలం అతిథి పాత్రగా మిగిలి పోయింది. అలాగే, ‘దేవర’లో కూడా జాన్వీ కపూర్ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వబడలేదు. కల్కి లోనూ దిశా పటాని ని ఒక్క పాటకే పరిమితం చేశారు.
Also Read: Telugu Cinema: తెలుగు హీరోల నార్త్ కల మెల్లమెల్లగా నెరవేరుతుందా?
అలా బాలీవుడ్ భామలు పాన్ ఇండియా సినిమాల్లో నటించాలనే ఆశతో వస్తారు, కానీ ఎక్కువ సందర్భాల్లో వారి ఆశలు నెరవేరవు. వారి పాత్రలు అందం చూపించడం వరకు మాత్రమే పరిమితమై పోతున్నాయి, కథలో అతి తక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల వారి కెరీర్‌కు నష్టం వాటిల్లుతుంది.
‘కల్కి’లో దీపికా పదుకొణె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను చూస్తే, తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు బలమైన పాత్రలు ఇవ్వవచ్చని అర్థమవుతుంది. కానీ చాలా సినిమాల్లో, హీరోయిన్ పాత్రలు కేవలం అందానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. దీన్ని మార్చాలి. కథలో హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరింత ఎదగవచ్చు. పాన్ ఇండియా చిత్రాలలో హీరోయిన్ల పాత్రలను విస్తృతంగా కలిగి ఉండేందుకు, మనం జాగ్రత్తగా ఆలోచించాలి.