Spam Calls: స్పామ్ కాల్స్ తో విసిగిపోతున్నారా..? వాటిని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా..? ఎన్ని సార్లు స్పాం రిపోర్ట్ లు కొట్టినా కూడా కొత్త నెంబర్ల నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయా..? అయితే మీకోసమే గూగుల్ ప్రత్యేక ఫీచర్లను ఇస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకి కాలర్ ఐడీ స్పామ్ ప్రొటెక్షన్ అనే పేర్లతో వీటిని అందుబాటులో ఉంచింది, వీటిని మీరు కనుక మీ ఫోన్లో ఎనేబుల్ చేశారంటే, స్పాం కాల్స్ కి పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చు. స్మార్ట్ ఫోన్ లేని సమాజాన్ని మనం అసలు ఊహించలేము.

How to block Spam Calls

అరిచేతుల్లోనే ప్రతిదీ చూసుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ ని సక్రమంగా ఉపయోగించాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. ఇటీవల పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగంపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్న విషయాన్ని చెప్తున్నాయి. వీటితోపాటుగా నేరగాళ్లు కొన్ని స్పామ్ కాల్స్ ద్వారా మనల్ని మోసం చేస్తున్నారు. అలానే కొన్నిసార్లు మనకి వాటి కారణంగా విసుగు కూడా వస్తూ ఉంటుంది. చాలా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కూడా ఈ కాల్స్ వస్తూ ఉంటాయి. లోన్ ఆఫర్స్ అని క్రెడిట్ కార్డు ఆఫర్లని చెప్పి మోసం చేస్తూ ఉంటారు.

Also Read:HP chromebook: ట్యాబ్‌ కొనే డబ్బులతో.. రూ.10 వేలు పెట్టి ల్యాప్‌టాప్‌ కొనేయచ్చు..!

కొన్ని స్పాం కాల్స్ ని నమ్మి కొన్ని పెట్టుబడి పథకాలలో ఇన్వెస్ట్ చేసి మోసపోయిన ఉదంతాలు కూడా మనం చాలా చూసాం. అలాంటి సందర్భంలో మనం వీటి నుండి ఎలా బయటపడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.. ఆండ్రాయిడ్ యూజర్లకి గూగుల్ ప్రత్యేక ఫీచర్ ఇస్తోంది. కాలర్ ఐడీ స్పామ్ ప్రొటెక్షన్ అనే పేర్లతో వీటిని అందుబాటులో ఉంచింది. మీ ఫోన్లో వీటిని ఎనేబుల్ చేయడం ద్వారా స్పాం కాల్స్ కి పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చు. ఫోన్ లో ఫోన్ యాప్ ని క్లిక్ చేయాలి. దాంతో కాల్ లాక్ చేసి ఉంటుంది. దానికి పైన కుడివైపున మూడు చుక్కలు మీకు కనబడతాయి దాని క్లిక్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి కాలర్ ఐడీ అండ్ స్పాం ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది (Spam Calls).