Hydra: హైదరాబాద్ నగరాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది హైడ్రా. హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, చెరువులు, FTL పరిధిలో కట్టినటువంటి బిల్డింగులపై హైడ్రా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అటు బౌరంపేట, ఇటు బోరబండ కబ్జాలు, అక్రమ కట్టడాలు, అడ్డదారిలో అనుమతులు తీసుకువచ్చి కట్టిన బిల్డింగులన్నింటినీ హైడ్రా కూల్చి వేయడం జరుగుతుంది. ఆదివారం ఉదయం నుంచి బోరబండ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు ప్రారంభించారు. Hydra
Hydra Demolition of YCP leader Katasani farm house Jagane target next
తమ భవనాలను కూల్చోద్దంటూ కొందరు బాధితులు నిరసనలు కూడా చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. ఈ తరుణంలోనే వైసీపీకి చెందిన కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. ఇక్కడ అక్రమంగా నిర్మాణాలను చేపట్టారని వారం క్రితం స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. Hydra
Also Read: Sathyavedu: ఏపీలో ఉపఎన్నిక..త్వరలోనే నోటిఫికేషన్ విడుదల?
దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలు అని తెలియడంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. వాణీనగర్ లోని పలు నిర్మాణాలను కూడా హైదరాబాద్ లో నేలమట్టం చేశారు. అమీన్ పూర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై తాజాగా కేసు నమోదు అయింది. Hydra
హైడ్రా కూల్చివేతలపై ఆందోళనలు, నిరసనల మధ్య హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని అనౌన్స్ చేశారు. FTL, బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తామంటూ రంగనాథ్ ప్రకటించారు. ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న వారి ఇళ్ళను కూల్చివేయమంటూ సంచలన ప్రకటన చేశారు. FTL, బఫర్ జోన్ లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దంటూ ప్రజలకు సూచనలు చేశారు. Hydra